రెండు రోజుల క్రితమే మెగా హీరో వరుణ్ తేజ్ మోకాలికి గాయమై సర్జరీ జరగ్గా, ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు సర్జరీ జరిగింది. శుక్రవారం ఉదయం తన అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన ఆఫీసర్లతో డిస్కషన్ చేస్తుండగా, తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ నుంచి వచ్చిన పవన్… కొద్ది నెలలుగా హెల్త్ ఇష్యూస్‌తో ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటిల్‌కు వెళ్లారు. అక్కడ కొన్ని టెస్టులతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన డాక్టర్లు సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని సర్జరీ చేశారు. వారం నుంచి పది రోజులపాటు ఆయనకు బెడ్ రెస్ట్ అవసరం ఉందని డాక్టర్లు కోరారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తిగా కోలుకోవడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పినట్టు జనసేన అధికార ప్రతినిధి, రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే అసలు పవన్ కళ్యాణ్‌కు ఏం జరిగిందని, ఎక్కడ సర్జరీ జరిగిందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అభిమానులంతా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజోనోవా.. ‘ఆయన కోలుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. ఆల్ ఈజ్ వెల్’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయినా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు.






