ఓవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే, మరోవైపు ఫిమేల్ సెంట్రిక్ సినిమాల్లోనూ సత్తా చాటుతోంది రష్మిక మందన్న. ఇటీవల విజయ్ దేవరకొండను వివాహమాడిన రష్మిక మందన్నా ప్రస్తుతం కెరీర్‌పై ఫోకస్ పెట్టి తను కమిట్ అయిన చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తిచేసే పనిలో ఉంది. ప్రస్తుతం ఆమె లీడ్ రోల్లో నటిస్తున్న ఉమెన్ ఓరియెండెట్ మూవీ ‘మైసా’. ఇందులో గోండు గిరిజన తెగకు చెందిన పవర్ఫుల్ ఉమెన్‌గా రష్మిక కనిపించనుంది. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్సుల కోసం ఆమె కఠోర శ్రమ పడుతోంది. అంతర్జాతీయ ఫైట్ మాస్టర్ ఆండీ లాంగ్ పర్యవేక్షణలో రష్మిక కిక్ బాక్సింగ్‌తో సహా పలు స్టంట్స్‌ను కూడా నేర్చుకుంటోంది. రోజుకు దాదాపు ఎనిమిది గంటలు శ్రమిస్తూ వీటిలో నైపుణ్యం సాధిస్తోంది. ఈ క్రమంలో రష్మిక ఏ విధంగా కష్టపడుతుందో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పాత్రకోసం ఎంతలా కష్టపడటానికైనా సిద్ధంగా ఉంటానని రష్మిక మరోసారి స్పష్టం చేసింది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కేరళలో జరగనుంది. 16రోజులపాటు జరగనున్న ఈ యాక్షన్ షెడ్యూల్ కోసమే రష్మిక ఇలా శ్రమిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లో రష్మిక క్యారెక్టర్‌ను ఇంట్రడ్రూస్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు మేకర్స్. ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.
మరోవైపు తన భర్త విజయ్ దేవరకొండకు జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా నుంచి ఇటీవల తన పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో జయమ్మ పాత్రలో శాంతంగా కనిపిస్తున్న ఆమె లుక్ ఆకట్టుకుంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.





