సల్మాన్‌ఖాన్, నయనతార, వంశీపైడిపల్లి మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

ఇటీవల కాలంలో తెలుగు దర్శకులు హిందీ హీరోలతో, హిందీ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు రూపొందిస్తూ సరికొత్త కాంబోలను శ్రీకారం చూడుతున్నారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే పలువురు స్టార్ డైరెక్టర్స్ అక్కడి టాప్ హీరోలను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. రణ్‌బీర్‌‌ హీరోగా సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ను, సన్నీడియోల్ హీరోగా గోపీచంద్ మలినేని ‘జాట్‌’ను రూపొందించి సూపర్ సక్సెస్‌లను అందుకున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్‌‌ సల్మాన్‌ ఖాన్ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా రాబోతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్​ బ్యానర్​పై దిల్​రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా అఫీషియల్‌గా ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేయగా, శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈరోజు నుంచే రెగ్యులర్ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేస్తున్నట్టు రివీల్ చేస్తూ.. దర్శకుడు వంశీ పైడిపల్లి సోషల్ మీడియా వేదికగా ‘అన్నీ ఈరోజు నుంచే ప్రారంభం’ అంటూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ముహూర్తపు షాట్‌ రాసున్న క్లాప్ బోర్డ్‌ ఫొటోను షేర్ చేశారు. సల్మాన్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా అన్ని రకాల కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాస్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌ క్యారెక్టర్‌‌ ఎంతో కీలకంగా ఉండబోతోందని, నయనతార లాంటి పవర్‌‌ఫుల్‌ నటిని ఆ పాత్రకు ఎంపిక చేసినట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. సౌత్‌ హీరోయిన్స్‌లో సూపర్‌‌స్టార్‌‌గా వెలుగుతున్న నయనతారకు.. బాలీవుడ్‌లో ఇది రెండో సినిమా. షారుఖ్ ఖాన్ సినిమా ‘జవాన్‌’తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన నయన్‌.. తొలిచిత్రంతోనే హిందీలో బ్లాక్ బస్టర్‌‌ అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నయన్‌.. సల్మాన్‌ ప్రాజెక్ట్‌లో చేరడం సినిమాకు మరింత బజ్ తీసుకువచ్చింది. అలాగే తమిళ హీరో విజయ్‌తో తీసిన ‘వారసుడు’ తర్వాత వంశీ పైడిపల్లి చేయబోతున్న సినిమా ఇదే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్‌వీసీ) బ్యానర్‌‌లో 63వ చిత్రం. దీన్నొక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా మేకర్స్ భావిస్తున్నారు. సల్మాన్‌ సినిమాలు ఈద్‌ సీజన్‌లో రిలీజ్‌ కావడం అనే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ వచ్చే ఏడాది ఈద్‌ ఈద్ సందర్భంగా మార్చిలో ఈ సినిమాను రిలీజ్‌ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మరోవైపు సల్మాన్ ఖాన్ హీరోగా అపూర్వ లఖియా తెరకెక్కించిన ‘మాతృభూమి’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది.

 

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని