రీసెంట్గా రష్మికను వివాహమాడిన విజయ్ దేరవకొండ.. ఓవైపు ఫ్యామిలీమేన్లా ఉంటూనే మరోవైపు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ఇప్పటికే ‘రణబాలి’తో పాటు ‘రౌడీ జనార్థన’ సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నారు. శనివారం విజయ్ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. నానితో ‘హాయ్ నాన్న’ లాంటి ఎమోషనల్ ఫీల్‌గుడ్ మూవీ తీసిన శౌర్యువ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కొత్త సినిమాను ప్రకటించారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ ప్రెస్టీజియస్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అనౌన్స్మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ చేతిలో నాలుగు పెట్ డాగ్స్ ను తీసుకుని నడుచుకుంటూ వస్తుండటం, వెనక ఏడుగురు వ్యక్తులు వివిధ రకాల వెపన్స్ పట్టుకుని రావడం ఆసక్తి కలిగిస్తోంది. ‘ఇప్పుడు కనిపించే కోపమంతా ఒకప్పటి ప్రేమ’ అంటూ పోస్టర్ పై రాసిన క్యాప్షన్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుంది. ఈ సినిమాకు హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ ఔట్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్ మ్యాన్ ఫరెవర్, స్నోపియర్సర్ చిత్రాల వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ఎరిక్ డస్ట్ర్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. యానిమల్, ఓం శాంతి ఓం వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్ హిట్ చిత్రాల కంపోజర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.ఇలాంటి ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ తో గ్లోబల్ ప్రాజెక్ట్ గా ఈచిత్రాన్ని రూపొందించనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు.
మరోవైపు పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘రణబాలి’ చిత్రంలో బ్రిటీషర్ల అకృత్యాలపై పోరాడే యోధుడిగా విజయ్ కనిపించనున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న పాన్ ఇండియావైడ్‌గా సినిమా విడుదల కానుంది. అలాగే రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రౌడీ జనార్థన’ చిత్రం కూడా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.





