Ruhani Sharma Emotional Connect
కొన్ని కథలు కేవలం సినిమాలుగానే మిగిలిపోవు.. మన జీవితంలోని అనుభవాలను గుర్తుచేస్తూ మనసుకు దగ్గరవుతాయి. అలాంటి అనుబంధమే ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో తనకు ఏర్పడిందని చెబుతోంది హీరోయిన్ రుహానీ శర్మ. ఈ సినిమా కథతో వ్యక్తిగతంగా ఎంతో కనెక్ట్ అయ్యానని, ఇందులో తాను పోషించిన బిజిలీ పాత్ర కూడా చాలా ప్రత్యేకమని ఆమె వెల్లడించింది.
Ruhani Sharma Emotional Connect
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రుహానీ శర్మ బిజిలీగా కనిపించనుంది. లైట్బాక్స్ మీడియా పతాకంపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించిన ఈ సినిమాను స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సమర్పిస్తున్నాయి. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో రుహానీ చేసిన ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఆకాశంలో ఒక తార’ కథ తనకు ఎంతో దగ్గరైందని చెప్పింది. కథలోని అమ్మాయి మాదిరిగానే తాను కూడా హిమాచల్ ప్రదేశ్లోని ఓ చిన్న ఊరి నుంచి వచ్చానని గుర్తుచేసుకుంది. ఒకప్పుడు హీరోయిన్గా మారి ఇలాంటి వేదికపై నిలబడి మాట్లాడతానని ఎవరైనా చెప్పి ఉంటే అస్సలు నమ్మేదాన్ని కాదని తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంది.
జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల కారణంగా మన కలలను చిన్నవి చేసుకోకూడదని, మన లక్ష్యాలపై నమ్మకంతో ముందుకు సాగాలని రుహానీ అభిప్రాయపడింది. ఇక సినిమాలో బిజిలీ పాత్రను ఎంతో ఇష్టపడి చేశానని తెలిపింది. ఒక క్యారెక్టర్ ఎంతసేపు తెరపై కనిపిస్తుందన్నది తనకు ముఖ్యం కాదని, కథలో ఆ పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందన్నదే తాను ప్రధానంగా చూస్తానని స్పష్టం చేసింది. అందుకే బిజిలీ పాత్ర తనకు నచ్చి అంగీకరించానని చెప్పిన రుహానీ.. ప్రేక్షకులు సినిమాతో పాటు తన నటనను కూడా ఇష్టపడతారనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది.