Ravi Teja Begins Dubbing for Irumudi
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఉండబోతున్నాయనే సంకేతాలను తాజాగా విడుదలైన డబ్బింగ్ వీడియో స్పష్టంగా తెలియజేసింది.
తన షూటింగ్ భాగాన్ని ఇప్పటికే పూర్తి చేసిన రవితేజ ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసిన స్టూడియో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా వీడియోలో రవితేజ చెప్పిన “నాకు ఒకే ఒక్క కూతురే… పేరు మనమ్మ” అనే డైలాగ్ ప్రేక్షకులను ఎమోషనల్‌గా టచ్ చేస్తోంది. ఒక్క డైలాగ్‌తోనే సినిమాలో తండ్రి-కూతురు అనుబంధం ఎంత కీలకంగా ఉండబోతోందో మేకర్స్ హింట్ ఇచ్చారు. డబ్బింగ్ వీడియోలో చిన్నారి నటి బేబీ నక్షత్రతో పాటు దర్శకుడు శివ నిర్వాణ కూడా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. యాక్షన్, ఎమోషన్ల మేళవింపుగా సినిమా ఉండబోతుందనే అభిప్రాయం ఈ వీడియో తర్వాత మరింత బలపడుతోంది.
Ravi Teja Begins Dubbing for Irumudi
ఇక చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇంకా మూడు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టైటిల్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. త్వరలోనే రెండో పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రవితేజను ఒక కొత్త ఎమోషనల్ షేడ్‌లో చూపించబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.