ట్రైలర్ వచ్చేస్తోంది.. భోపాల్‌లో భారీ ఈవెంట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌తో ఇప్పటికే స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్లు, రెండు చార్ట్‌బస్టర్ పాటలు, రెండు డిఫరెంట్ గ్లింప్సెస్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. రిలీజ్ కౌంట్‌డౌన్ ప్రారంభమైన వేళ, మేకర్స్ మరో కీలక అప్డేట్ ప్రకటించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు రామ్ చరణ్ పాత్రలోని రెండు షేడ్స్‌ను చూపించిన చిత్రబృందం, ట్రైలర్‌లో సినిమా అసలు కథతో పాటు ప్రధాన పాత్రలను మరింత స్పష్టంగా పరిచయం చేయనుందని తెలుస్తోంది. దీంతో ట్రైలర్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ ట్రైలర్‌‌ను మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో భారీ ఈవెంట్ నిర్వహించి అక్కడ రిలీజ్ చేయనున్నారు. అంచనాలను మరింత పెంచుతూ విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో రామ్ చరణ్ 1960ల గ్రామీణ యువకుడి లుక్‌లో రైల్వే ట్రాక్‌పై నడుస్తూ కనిపిస్తున్నారు. విజువల్స్‌లోని ప్రతి చిన్న డీటైలింగ్ ఆ కాలాన్ని ఎంత సహజంగా, క్రియేటివ్‌గా రీక్రియేట్ చేశారో స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ కొత్త గెటప్‌లో రామ్ చరణ్ మరింత ఆకట్టుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 4న పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఓవర్సీస్ ప్రీమియర్లు జూన్ 3న జరగనున్నాయి.

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ‘పెద్ది’ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ అసాధారణ వేగంతో సాగుతూ కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్నాయి. ఇంటర్నేషనల్ రిలీజ్‌ను ప్రత్యంగిర సినిమాస్ నిర్వహిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పూర్తి స్థాయిలో రగ్గడ్ మేకోవర్‌లో కనిపించనున్నారు. కథలో విభిన్న టైమ్‌లైన్స్ ఉండటంతో ఆయన పాత్రకు డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయని ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్ సూచించాయి. జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి బలమైన తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. టెక్నికల్‌గా కూడా ‘పెద్ది’ భారీ స్థాయిలో రూపొందుతోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

Related Posts

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

Peddi Trailer Takeover Event Live in Mumbai :https://www.youtube.com/live/1Ioap46edNs ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది ట్రైలర్ మరికొన్ని క్షణాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ ఈవెంట్ ప్రస్తుతం ముంబైలో గ్రాండ్‌గా జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్…

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

Kamal Haasan–Sivakarthikeyan Second Movie Seyon Start : ‘అమరన్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో వస్తోన్న రెండో సినిమా ‘సియాన్’. సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

  • By Nani
  • May 18, 2026
  • 3 views
పెద్ది  ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

  • By Nani
  • May 18, 2026
  • 8 views
కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

  • By Nani
  • May 17, 2026
  • 4 views
చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

  • By Nani
  • May 17, 2026
  • 5 views
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

  • By Nani
  • May 17, 2026
  • 12 views
‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

రాజస్థాన్‌లో ‘వృషకర్మ’

  • By Nani
  • May 17, 2026
  • 7 views
రాజస్థాన్‌లో ‘వృషకర్మ’