ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్, కామెడీతో..

నారా రోహిత్ తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పీ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రొడక్షన్ నెం. 5గా రూపొందుతోంది. #RN23 ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీగా, కుటుంబ భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రానికి నిర్మాతగా భరత్ చౌదరి వ్యవహరిస్తుండగా, కథ–స్క్రీన్‌ప్లే అందిస్తూ చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సోమవారం చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫస్ట్ షాట్‌ను డైరెక్ట్ చేయగా, సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాస్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

క్రేజీ హీరోయిన్ నయన్ సారిక ఈ చిత్రంలో రోహిత్ నారాకు జోడీగా నటిస్తున్నారు. అలాగే నరేష్ వీకే, రోహిణి, సంపత్, అజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వినోదానికి మరింత బలం చేకూర్చేందుకు వెన్నెల కిషోర్, సుదర్శన్, బ్రహ్మాజీ, రఘు కారుమంచి కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌పై ఉన్న “షౌటింగ్ సూన్” ట్యాగ్‌లైన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. పోస్టర్‌లో కనిపించిన కలర్‌ఫుల్ టోన్, ఎనర్జిటిక్ వైబ్ ఈ సినిమా పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని సూచిస్తున్నాయి. టెక్నికల్ టీమ్ కూడా బలంగా ఉంది. సినిమాటోగ్రాఫర్‌గా వెంకట్ సి దిలీప్ పనిచేస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను సుప్రియా బట్టెపాటి నిర్వహిస్తున్నారు.

యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా హాస్యం, ప్రేమ, భావోద్వేగాలు, రిలేటబుల్ మూమెంట్స్‌తో #RN23 రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్‌ను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ‘‘సౌండ్ ఇంజినీర్”అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

 

Related Posts

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

Peddi Trailer Takeover Event Live in Mumbai :https://www.youtube.com/live/1Ioap46edNs ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది ట్రైలర్ మరికొన్ని క్షణాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ ఈవెంట్ ప్రస్తుతం ముంబైలో గ్రాండ్‌గా జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్…

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

Kamal Haasan–Sivakarthikeyan Second Movie Seyon Start : ‘అమరన్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో వస్తోన్న రెండో సినిమా ‘సియాన్’. సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్…

One thought on “ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్, కామెడీతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

  • By Nani
  • May 18, 2026
  • 3 views
పెద్ది  ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

  • By Nani
  • May 18, 2026
  • 8 views
కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

  • By Nani
  • May 17, 2026
  • 4 views
చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

  • By Nani
  • May 17, 2026
  • 5 views
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

  • By Nani
  • May 17, 2026
  • 12 views
‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

రాజస్థాన్‌లో ‘వృషకర్మ’

  • By Nani
  • May 17, 2026
  • 7 views
రాజస్థాన్‌లో ‘వృషకర్మ’