Peddi Most Inspiring Movie :
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందించిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను సోమవారం ముంబైలో విడుదల చేశారు.
https://www.youtube.com/watch?v=sF2dj7ycZvA
ఇందులో పెద్ది పాత్రను పూర్తి పరిచయం చేశారు. పెద్దిని ఒక మల్టీ టాలెంటెండ్ ఆటగాడిగా చూపించారు. క్రికెట్, కుస్తీ, రన్నింగ్.. ఏ ఆట అయినా తన శక్తితో నెగ్గే ఆటగాడిగా చరణ్‌ను చూపించిన తీరు ఆకట్టుకుంది. ఊరిలో యువతకు హీరోలా కనిపించే పెద్ది.. గ్రామస్తుల గౌరవాన్ని కూడా సంపాదించుకుంటాడు. అయితే అతని ఎదుగుదల ఒక ఆధిపత్య వర్గానికి నచ్చదు. అక్కడి నుంచి తన విశ్వరూపాన్ని చూపిస్తారు చరణ్. ఈ దేవుడు గుడిలో ఉండడు… గ్రౌండ్లో ఉంటాడు అనే డైలాగ్స్ ని చూస్తే.. ఇది కేవలం స్పోర్ట్స్ డ్రామా కాదు.. ఆట, బతుకు, పోరాటం అన్నీ కలిసిన ప్రపంచం అనేలా ట్రైలర్‌ను కట్ చేశారు. ‘మాటలతో కాదు.. ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికి ఉందో రమ్మను.. మీరందరు నేను ఆడాను అనుకుంటున్నారు.. నేను పోరాడాను సారూ..’ అనే డైలాగ్స్‌తో సినిమాలోని డెప్త్‌ను తెలియజేస్తున్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపిస్తూ అందర్నీ ఇంప్రెస్ చేశారు. ఆయన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, బాడీ లాంగ్వేజ్, అథ్లెటిక్ ప్రెజెన్స్ అన్నీ కూడా పాత్రకు పర్ఫెక్ట్గా కుదిరాయి. ఒకవైపు ఫ్లడ్లైట్స్ కింద రఫ్ బ్యాట్‌తో క్రికెట్ ఆడే పెద్ది.. మరోవైపు మట్టిలో కుస్తీ పోరాటాల్లో దిగే పెద్ది.. అలాగే రన్నింగ్ ట్రాక్‌పై రన్నర్‌గా స్టైలిష్‌గా ఈ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో చరణ్ కనిపించిన తీరు అద్భుతం. జాన్వీ కపూర్ విలేజ్ గర్ల్‌గా నటించిన తీరు, ఆమె చూపించిన ఎక్స్ప్రెషన్స్ ఆకట్టుకున్నాయి. అలాగే శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ పాత్రలు కూడా కథలో బలమైన ప్రాధాన్యం కలిగి ఉన్నాయని ట్రైలర్ సూచించింది. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరింత ఎలివేట్ చేసింది.
Peddi Most Inspiring Movie :
ఈ సందర్భంగా ముంబైలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం గత రెండేళ్లుగా ప్రాణం పెట్టి పని చేశాం. బుచ్చిబాబు అయితే గత ఐదేళ్లుగా ఈ సినిమాతోనే ట్రావెల్ అవుతున్నారు. ప్రతి ప్రాజెక్ట్‌కు నాలుగు పిల్లర్లు ఉంటాయి. కానీ మా ప్రాజెక్ట్‌కు సెంటర్ పిల్లర్ ఏఆర్ రెహమాన్ గారు. రెహమాన్ గారి మ్యూజిక్ అంటే నాకు ఎంతో అభిమానం. ఆయన ‘పెద్ది’లో భాగం కావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. దివ్యేందు ఒక గ్యాంగ్‌స్టర్. తనకంటూ ఓ స్టైల్ స్వాగ్ లో కనిపిస్తాడు. రత్నవేలు గారితో ఇది నాకు ఐదో చిత్రం. ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. జాన్వి చాలా హార్డ్‌వర్కింగ్ పర్సన్. తనలో చాలా డెడికేషన్ ఉంది. తన పాత్రను ఎంతో నిజాయితీగా చేసింది. మా నాన్నగారు, శ్రీదేవి మేడం కలిసి సినిమాలు చేశారు. జాన్వి, నేను కలిసి నటించాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఇది మాకు ఒక నోస్టాల్జిక్ మూమెంట్. ఈ క్యారెక్టర్ చేయడం ఫిజికల్‌గా చాలా చాలెంజింగ్. సల్మాన్ ఖాన్ గారు, ఆమిర్ ఖాన్ గారు ‘సుల్తాన్’, ‘దంగల్’ లాంటి చిత్రాలతో మాకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు. బుచ్చిబాబు కథ చెప్పినప్పుడే ఈ పాత్ర కోసం ట్రాన్స్ఫర్మ్ అవ్వాలని తెలుసు. ఇది చాలా నిజాయితీగా చేసిన సినిమా. అందరికీ ఒక ఐడెంటిటీ కావాలి. అలాంటి ఐడెంటిటీ కోసం చేసే ప్రయాణం. ఈ కథని దర్శకుడు చాలా ఆర్గానిక్‌గా, అలాగే హైలీ కమర్షియల్‌గా చూపించారు. ప్రేక్షకులందరూ చాలా సర్ప్రైజ్ అవుతారు. నా కెరీర్లో చేసిన మోస్ట్ ఇన్స్పైరింగ్ ఫిల్మ్ ఇది. ఇలాంటి సినిమాలు దశాబ్దంలో ఒకసారి మాత్రమే వస్తాయి. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు తరచుగా రావు. అవి రావాలంటే సంవత్సరాలు పడుతుంది. పెద్ది కూడా లాంటి అరుదైన సినిమా . ‘ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు. ఇలాంటి సినిమా చేస్తున్నపుడు ప్రతిక్షణం ఆస్వాదించాలి’ అని నాన్నగారు చెప్పేవారు. మంచి సినిమాలు అంత ఈజీగా రావు. ‘మగధీర’ చేసిన ఏళ్ల తర్వాత ‘రంగస్థలం’ వచ్చింది. తర్వాత ఆర్ఆర్ఆర్ వచ్చింది. లక్కీగా పెద్ది త్వరగానే వస్తుంది. ఇది నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే సినిమా”అని చెప్పారు.
హీరోయిన్ జాన్వి కపూర్ మాట్లాడుతూ ‘‘ ఈ సినిమా కోసం మేము గత రెండేళ్లుగా పని చేస్తున్నాం. అందరితో కలిసి ట్రైలర్ చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇది మాకు చాలా స్పెషల్ మూమెంట్. బుచ్చిబాబు గారు రౌడీ డైరెక్టర్ (నవ్వుతూ). తనకు కావాల్సిన ఔట్పుట్ వచ్చే వరకు వదిలిపెట్టరు. రెహమాన్ గారు మ్యూజిక్ చేసే సినిమాలో నటించడం ఒక గౌరవం. రామ్ చరణ్ గారితో కలిసి పని చేయడం నా జీవితంలో గొప్ప గౌరవం. అమ్మగారు, చిరంజీవి గారు నటించిన సినిమాలకు ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపించారు. మా కాంబినేషన్ కూడా ప్రేక్షకులకు ఎదురుచూశారు. ‘పెద్ది’ నాకు చాలా స్పెషల్ ఫిలిం. రామ్ చరణ్ గారు ద బెస్ట్ పర్సన్. ఈ సినిమాను మీరందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా”అని చెప్పింది.
ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. “నేను తమిళ్ సినిమాలు చేస్తూ, అవి తెలుగులో డబ్ అవుతూ వచ్చాయి. అయితే నేరుగా తెలుగు సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ‘పెద్ది’ రూపంలో ఆ అవకాశం వచ్చింది. బుచ్చిబాబు గారు ఈ కథ చెప్పినప్పుడు ఆయన కళ్లలో ఉన్న ప్యాషన్ చూశాను. అప్పుడే ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా కావాలని అనిపించింది. రామ్ చరణ్ గారి హార్డ్‌వర్క్‌ను నేను ఫిజికల్‌గా, మెంటల్‌గా చూశాను. బుచ్చిబాబు సాఫ్ట్‌గా కనిపిస్తారు కానీ తనకు కావాల్సిన ఔట్పుట్ వచ్చే వరకు ఎక్కడా రాజీపడరు. ఇది చాలా స్పెషల్ ఫిలిం’ అని అన్నారు.
నిర్మాత సతీష్ కిలారు మాట్లాడుతూ.. “ముంబై నుంచి ప్రమోషన్స్ కిక్‌స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం చేసిన హార్డ్‌వర్క్ మాటల్లో చెప్పలేం. చాలా గాయాలు అయ్యాయి. అయినా వాటిని లెక్క చేయకుండా పని చేశారు. ‘రంగస్థలం’ సమయంలో రామ్ చరణ్ గారు ‘మీతో ఒక సినిమా చేస్తాను’ అన్నారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది”అని అన్నారు.
Peddi Most Inspiring Movie :
దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. “నా రెండో సినిమాకే ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఆయనకు చాలా గాయాలు అయ్యాయి. కానీ అవన్నీ లెక్క చేయలేదు. ఏఆర్ రెహమాన్ గారితో పని చేయడం నా డ్రీమ్” అని చెప్పారు.
‘పెద్ది’ లాంటి పెద్ద సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందని దివ్యేందు, డీఓపీ రత్నవేలు అన్నారు.