కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

Kamal Haasan–Sivakarthikeyan Second Movie Seyon Start :
‘అమరన్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో వస్తోన్న రెండో సినిమా ‘సియాన్’. సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌లో శివకార్తికేయన్ ఇంటెన్స్‌గా, రగ్డ్ అవతార్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. ఫైర్ మధ్య ఉన్న శివకార్తికేయన్ స్టైల్ ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని పెంచుతోంది. ‘వన్ విజన్.. వన్ జర్నీ’ అనే ట్యాగ్‌లైన్‌తో మేకర్స్ విడుదల చేసిన ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. దర్శకుడు శివకుమార్ మురుగేసన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథలో రాజకీయ నేపథ్యంతో కూడిన పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా ఎలిమెంట్స్ ఉంటాయని, పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రూపొందనుందని తెలుస్తోంది.

Kamal Haasan–Sivakarthikeyan Second Movie Seyon Start :

కమల్ హాసన్ తన ప్రతిష్టాత్మక బ్యానర్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై నిర్మిస్తున్నారు. కమల్, శివకార్తికేయన్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. చెన్నైలో మొదటి షెడ్యూల్ ప్రారంభమవుతుండగా, కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌‌లో సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కమల్ హాసన్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, శివకార్తికేయన్ మాస్ ఇమేజ్, సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అన్నీ కలిసి ఈ సినిమాను తమిళ సినీ పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా నిలబెడుతుందని మేకర్స్ తెలియజేశారు.

Related Posts

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

Peddi Trailer Takeover Event Live in Mumbai :https://www.youtube.com/live/1Ioap46edNs ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది ట్రైలర్ మరికొన్ని క్షణాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ ఈవెంట్ ప్రస్తుతం ముంబైలో గ్రాండ్‌గా జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్…

చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

Surgery on Ram Charan hand on Monday : చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. గాయాలైనా షూటింగ్ ఆపలేదు చరణ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. Surgery on Ram Charan hand on Monday : రామ్ చరణ్​ అభిమానులు ఆసక్తిగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

  • By Nani
  • May 18, 2026
  • 3 views
పెద్ది  ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

  • By Nani
  • May 18, 2026
  • 8 views
కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

  • By Nani
  • May 17, 2026
  • 4 views
చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

  • By Nani
  • May 17, 2026
  • 4 views
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

  • By Nani
  • May 17, 2026
  • 12 views
‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

రాజస్థాన్‌లో ‘వృషకర్మ’

  • By Nani
  • May 17, 2026
  • 7 views
రాజస్థాన్‌లో ‘వృషకర్మ’