ఆహాలో ‘పోచమ్మ’ సిరీస్ స్ట్రీమింగ్‌కు రెడీ

  • NaniNani
  • OTT
  • April 13, 2026
  • 0 Comments

తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ “పోచమ్మ” ను సబ్ స్క్రైబర్స్ ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో అంబటి అర్జున్, శ్రీ పూజా రెడ్డి, స్నేహా కీలక పాత్రల్లో నటించారు. “పోచమ్మ” వెబ్ సిరీస్ ఈ నెల 17వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందుగానే యాక్సెస్ పొందవచ్చు. ఈ వెబ్ సిరీస్ ను శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్ పై శ్రుతి నాయుడు నిర్మిస్తోంది. రమేష్ ఇంద్ర దర్శకత్వం వహించారు. ఈ రోజు మేకర్స్ “పోచమ్మ” ట్రైలర్ రిలీజ్ చేశారు. “పోచమ్మ” వెబ్ సిరీస్ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – చుట్టూ అడవులు ఉన్న ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఒక అందమైన ఇళ్లు ఉంటుంది. ఆ ఇంటి ముందే పోచమ్మ తల్లికి చిన్నగుడి కట్టి పూజిస్తుంటారు. ఆ ప్రాంతాన్ని, ఆ ఇంటిని పోచమ్మ తల్లి కాపాడుతుంటుంది. అలాంటి తల్లి గుడిని,ఆమె విగ్రహాన్ని తొలగిస్తే ఊరుకుంటుందా, ఆ తప్పులు చేసిన వారిని పోచమ్మ తల్లి ఎలా శిక్షించింది అనేది ట్రైలర్ లో ఆద్యంతం రోమాంచితంగా చూపించారు. ఒక యువ జంట ప్రేమ కథ, వారి ప్రేమకు అడ్డుపడే వ్యక్తులను ట్రైలర్ లో పరిచయం చేశారు. తను ఇష్టపడిన ఇంటికి, ఆ ప్రాంతానికి పోచమ్మ తల్లి తిరిగి రావడాన్ని చూపిస్తూ ట్రైలర్ ను ఆసక్తికరంగా ముగించారు.ఇలా థ్రిల్లింగ్, డివైన్ ఎలిమెంట్స్ తో “పోచమ్మ” సిరీస్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

Related Posts

‘పోచమ్మ’ సిరీస్ మంచి సౌండ్ చేస్తుంది

తెలుగు ఓటీటీ ఆహాలో వస్తోన్న సరికొత్త వెబ్ సిరీస్ ‘పోచమ్మ’. అంబటి అర్జున్, రమేశ్ ఇందిర, ప్రియ శతమర్షన్, స్నేహల్ కామత్, శృతి నాయుడు, శ్రీపూజ ప్రధాన పాత్రల్లో నటించారు. రమేశ్ ఇందిర దర్శకత్వంలో శృతి నాయుడు నిర్మించారు. ఏప్రిల్ 17…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని