గోపాల గోపాల.. గోకుల గోపాలక

కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్‌గా పరిచయమవుతున్నారు. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘గోపాల గోపాల..’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు సనరే సాహిత్యాన్ని అందించగా, వంశీకాంత్ రేఖన కంపోజ్ చేశారు, మేఘన నాయుడు పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే – ‘ గోకుల గోపాలక, మాధవ నారాయణ, కానగా సాధ్యమా, కలియుగ మాయ, గోకుల గోపాలక, మాధవ నారాయణ, కాలమే సాక్షిగా అలమిన మాయ, నీదు మాయే నీల వర్ణా , హాసమైనా శోకమైనా కాంతులే నిలుపవా కనుతడిన..’ అంటూ కలియుగంలో జరుగుతున్న వింత ఘటనల్ని ఆ గోవిందుడికి విన్నవిస్తూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్ ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు.

  • Related Posts

    జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

    మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

    ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

    ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

    • By Nani
    • April 24, 2026
    • 4 views
    మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

    రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

    • By Nani
    • April 23, 2026
    • 7 views
    రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

    జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

    • By Nani
    • April 23, 2026
    • 5 views
    జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

    ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

    • By Nani
    • April 23, 2026
    • 6 views
    ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

    ‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

    • By Nani
    • April 23, 2026
    • 7 views
    ‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

    కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

    • By Nani
    • April 22, 2026
    • 7 views
    కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని