విరాట్ కర్ణ, నభా నటేష్ జంటగా అభిషేక్ నామా రూపొందిస్తున్న చిత్రం ‘నాగబంధం’. ఈ మైథలాజికల్ అడ్వెంచర్ మూవీని కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘నమో రే’ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం సెకండ్ సాంగ్ అప్‌డేట్‌ను అందించారు మేకర్స్. ‘సుర సుర’ అంటూ సాగే రెండో పాటను ఏప్రిల్ 19న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, భక్తి గీతం ‘నమో రే’ ప్రేక్షకులను ఆకట్టుకుని చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఇప్పుడు ‘సుర సుర’ పాటతో ఫెస్టివ్ వైబ్‌ను ఈ సినిమా అందించనుంది. ఇది వెడ్డింగ్ సెలబ్రేషన్ సాంగ్‌గా సాగనుందని మేకర్స్ తెలియజేశారు. సంప్రదాయ పెళ్లి సంబరాల ఆనందం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా పాటను రూపొందించామని, భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌లతో ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలవనుందని చెప్పారు. జునైద్ కుమార్, అభే కంపోజ్ చేయగా, ఫోక్ ఎలిమెంట్స్‌తో ఫెస్టివ్ సాంగ్‌గా దీన్ని తీర్చిదిద్దామని, గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ మరింత జోష్ తీసుకురానుందని అన్నారు. కాసర్ల శ్యామ్ ఆకట్టుకునే సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి, కాల భైరవ, మంగ్లీ, సాహితి చాగంటి, కనకవ్వ, నల్గొండ గద్దర్ ఈ పాటను పాడటం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. గ్రాండ్ వెడ్డింగ్ కాన్సెప్ట్, కలర్‌ఫుల్ ఎనర్జీ, గ్రాండ్ కొరియోగ్రఫీతో ‘సుర సుర’ ఒక ఫెస్టివ్ ట్రీట్‌గా నిలవనుంది. ఏప్రిల్ 19 నుంచి ఈ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ‘నాగబంధం’ ప్రపంచాన్ని డ్యాన్స్ చేయించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్, రిషబ్ సావ్నీ, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాశ్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో జులై 3న సినిమా విడుదల కానుంది.





