నాగార్జున మేనకోడలిగా అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను చూసుకుంటూ నిర్మాతగానూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు సుప్రియ యార్లగడ్డ. ఆమె నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా షానియల్ డియో రూపొందించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై డీసెంట్ కలెక్షన్స్ తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోందని ఆమె చెప్పారు. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చిందని, ఒక మంచి సినిమా తీశామనే సంతృప్తి ఉందని సుప్రియ అన్నారు. ఈ సందర్భంగా సుప్రియ మీడియాతో ఇలా ముచ్చటించారు.
‘‘ఈ కథను అందరం చాలా నమ్మం. అందుకే బడ్జెట్‌పరంగా ఎప్పుడూ ఆలోచించలేదు. తెలుగుతోపాటు -హిందీలో రెస్పాన్స్ చాలా బావుంది. తెలుగులో తీసిన సినిమా అక్కడికి చేరడం చాలా ఆనందంగా వుంది. హిందీలో లాంగ్ రన్ వుంటుంది. యూఎస్ రెస్పాన్స్ -అద్భుతంగా వుంది. వీకెండ్ కి వన్ మిలియన్ దాటేస్తుంది. మహిళలకు, యువతకు సినిమా చాలా కనెక్ట్ అవుతుంది. తమిళ, మలయాళ, కన్నడలో కూడా డబ్ చేశాం. కాకపోతే ఆ డబ్ ఓటీటీకి పరిమితంగా వుంటుంది. సినిమా కేరళలో దుల్కర్ గారి బ్యానర్ ద్వారా రిలీజ్ అయ్యింది. హరి క్యారెక్టర్ లో శేష్ గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. శేష్, మృణాల్ క్యారెక్టర్స్ ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాయి. -అనురాగ్ కశ్యప్ గారు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పగానే చేస్తా అన్నారు. తర్వాత కథ విని చాలా ఇంప్రెస్ అయ్యారు. అలాగే ప్రకాష్ రాజ్ గారు చాలా బిజీ షెడ్యుల్ లో కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా టైం తీసుకోని చేశారు. పవన్ సింగ్, జోనితా లాంటి స్టార్స్ వుండటం వలన నార్త్ లో చాలా హెల్ప్ అయ్యింది. పవన్ సింగ్ గారిని ఒక పాట పాడమని సంప్రదించారు. అయితే ఆయనే కనిపిస్తానని అన్నారు. -భోజ్ పురి వారికి తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. మాస్ సినిమా అక్కడ చాలా పాపులర్. అంత పాపులర్ వుంటుందని నేనూ ఊహించలేదు. పవన్ సింగ్ గారు నాగ్ సర్ ని కలవాలని అడిగారు. మన సినిమా వాళ్ళు అంత ప్రేమిస్తారు. డెకాయిట్ కోసం చాలా మంది చాలా ప్రేమని చూపించారు. జోనితా పాట పాడటంతో పాటు తెరపై కనిపించింది. ఈ సినిమాను దాదాపు అందరూ కొత్తవాళ్ళతో చేశాం. అందరూ యంగ్ టీం. అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున గారు చాలా మంది కొత్తవాళ్ళని పరిచయం చేశారు. అయితే ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కెమరామ్యాన్ అయినా అనుభవం కలిగిన వారు వుంటారు. ఆయన అనుభవం సినిమాకి చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే ఇందులో డీవోపీ కూడా కొత్తే. అలాగే సినిమాని డిఫరెంట్ లోకేషన్స్ లో షూట్ చేశాం. డ్యాం దగ్గర షూట్ చేసినప్పుడు పర్మిషన్ తీసుకోవడం అంత ఈజీ కాదు. దాదాపు రెండువందల మందిని ఒక్క చోటికి చేర్చి షూట్ చేయాల్సి వచ్చేది. ఇలా షూటింగ్ లో చాలా ఛాలెంజెస్ వున్నాయి. యస్ యస్ క్రియేషన్స్ లో -వరుస సినిమాలు చేయాలని వుంది. సినిమా అంటే నాకు ప్రేమ. సినిమాతో ఆడియన్స్ కు సర్ప్రైజ్లు ఇస్తే ఇష్టం. ప్రేమ, త్యాగం, ద్రోహం, మోసం లాంటి ఎమోషన్స్ మన క్లాసిక్ లవ్ స్టోరీస్ లో వుంటాయి. ఇలాంటి కథలు తీయడానికి నేను బలం అవుతాను. ఇక నేను తీసిన మన్మధుడు నా ఫేవరేట్. అలాగే జానకి రాముడు నాకు చాలా ఇష్టం. మజ్ను కూడా నా ఫేవరట్.అలాగే సత్యం సినిమా ఇష్టం. గీతాంజలి అయితే మా ఫ్రెండ్స్ అందరి ఫేవరేట్’’.





