శర్వానంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది రూపొందిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘భోగి’. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే అనుపమ పోషిస్తున్న ‘కందుల సులోచన రాణి’ పాత్రను పరిచయం చేస్తూ విడుదలైన ఫస్ట్ లుక్ మంచి స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి మొత్తం డింపుల్ పాత్రపై నిలిచింది. సోమవారం డింపుల్ పాత్రను పరిచయం చేస్తూ తన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో డింపుల్ హయతి రెడ్ శారీలో పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. హ్యాండ్ ఫ్యాన్ పట్టుకుని ఇంటెన్స్‌గా కనిపిస్తున్న ఆమె లుక్ ఇంప్రెస్ చేస్తుంది. ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌గా.. ‘నా బొం….లో ప్రపంచం చల్ తీ.. మందార ఈడ’ అంటూ ఆమె మందారం పాత్రలో ఎవరినీ లెక్క చేయని క్యారెక్టర్ ప్లే చేస్తుందని స్పష్టం చేశారు. అలాగే ‘ ప్రపంచం కోరుకున్నది సౌందర్యం.. కానీ అది ఎన్నడూ అర్థం చేసుకోని ఆత్మ. భయం లేకుండా నడిచే డింపుల్ హయతి’ అని తన పాత్రలోని ఇంటెన్సినీ ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు. 1960ల నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సాగే కథతో తెరకెక్కుతున్న ‘భోగి’ యాక్షన్, ఎమోషన్‌లతో నిండిన పీరియడ్ డ్రామాగా రూపొందుతోంది. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 28న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి ‘కందుల సులోచన రాణి’ తర్వాత ఇప్పుడు ‘మందారం’ ఎంట్రీతో ‘భోగి’ చిత్రంపై అంచనాలు మరింత ఎత్తుకు చేరుకున్నాయి.





