balakrishna- Dada- movie-title-glimpse
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరోసారి తన మార్క్ మాస్ అవతార్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘వీరసింహారెడ్డి’ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి చేస్తున్న #NBK111పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు ‘దాదా’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ మాస్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తోంది.
balakrishna- Dada- movie-title-glimpse
టైటిల్ రివీల్ పోస్టర్లో బాలయ్యను పూర్తిగా మాస్ అవతార్‌లో చూపించారు. సన్‌గ్లాసెస్, లెదర్ జాకెట్, మెడలో భారీ గోల్డ్ చైన్, భుజంపై ఆయుధం.. ఇలా ఆయన లుక్ చూస్తేనే పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. బాలయ్య సీరియస్ ఎక్స్ప్రెషన్, ఆయన బాడీ లాంగ్వేజ్ పోస్టర్‌కు మరింత ఇంటెన్స్ లుక్‌ను తీసుకొచ్చాయి. రౌడీ, గ్యాంగ్‌స్టర్ షేడ్స్‌తో కనిపిస్తున్న ఈ లుక్ అభిమానుల్లో సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది.
ఇక టైటిల్ గ్లింప్స్ బాలకృష్ణ క్యారెక్టర్ పవర్, ఆరాను హైలైట్ చేసేలా సాగింది. ఆయనను ‘షేర్’గా సంబోధిస్తూ వినిపించే వాయిస్‌ఓవర్‌తో గ్లింప్స్ మొదలవుతుంది. అనంతరం పోలీస్ అధికారులు బాలయ్య క్యారెక్టర్‌ను చుట్టుముట్టి, ఛాతిలో కాల్చేస్తామని హెచ్చరిస్తారు. అప్పుడు బాలయ్య చెప్పే డైలాగ్ గ్లింప్స్‌కు అసలైన హైలైట్‌గా నిలిచింది.
“నాకు గురి పెట్టడానికి ఒంట్లో పొగరు వేలికి ట్రిగ్గర్ ఉంటే సరిపోదు.. బుల్లెట్స్‌కి బలుపు, గన్స్‌కి గట్స్ ఉండాలి.” అని బాలయ్య చెప్పే ఈ పవర్ఫుల్ డైలాగ్‌కు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడవడంతో సీన్ మరింత ఎలివేట్ అయింది. మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసేలా యాక్షన్, డైలాగ్, బీజీఎం అన్నీ పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయి.
బాలకృష్ణను లార్జర్ దేన్ లైఫ్ హీరోగా చూపించడంలో దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి తన మార్క్ చూపించారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’తో బాలయ్య మాస్ ఇమేజ్ను మరో స్థాయిలో ప్రజెంట్ చేసిన ఈ కాంబినేషన్.. ‘దాదా’తో మరింత హై వోల్టేజ్ యాక్షన్ ట్రీట్ అందించేందుకు సిద్ధమవుతున్నట్లు గ్లింప్స్ స్పష్టం చేస్తోంది.
ఎస్. థమన్ అందించిన ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ ఇంపాక్ట్‌ను పెంచింది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే ‘రాజా హూన్ మైన్’ ట్రాక్ యాక్షన్ సీక్వెన్స్‌కు అదనపు ఎనర్జీని తీసుకొచ్చింది.

టైటిల్‌ను ప్రకటించడంతో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. డిసెంబర్ 24న ‘దాదా’ థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. క్రిస్మస్ హాలిడేస్‌తో పాటు ముందస్తు న్యూ ఇయర్ ట్రీట్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక ఈ చిత్రంలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీని అరవింద్ ఎస్. కశ్యప్ నిర్వహిస్తుండగా, ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఏఎస్. ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు చేపట్టారు. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తుండగా, రామ్-లక్ష్మణ్, రవి వర్మ, వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.