Bigg Boss Telugu 10: Meet the 16 Contestants
బిగ్ బాస్ 10.. హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీరే
‘దశావతారం’ కాన్సెప్ట్‌తో పదో సీజన్
ఈసారి ఆటలో సవాల్ కాదు.. ఆటే ఒక సవాల్ అన్న నాగార్జున
తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన రియాలిటీ షో మళ్లీ సందడి మొదలుపెట్టింది. ‘బిగ్ బాస్ తెలుగు’ పదో సీజన్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. మైలురాయి సీజన్‌గా తెరకెక్కుతున్న ఈసారి షోకు కూడా కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరుసగా ఎనిమిదోసారి బిగ్ బాస్ వేదికపై హోస్ట్‌గా కనిపిస్తున్న నాగార్జున తనదైన స్టైల్, ఎనర్జీతో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌కు ప్రత్యేకమైన హైప్ తీసుకొచ్చారు.
Bigg Boss Telugu 10: Meet the 16 Contestants
‘దశావతారం’ కాన్సెప్ట్‌తో పదో సీజన్
పదో సీజన్‌ను పురస్కరించుకుని ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు ‘దశావతారం’ అనే ప్రత్యేక థీమ్‌ను ఎంచుకున్నారు. సరికొత్త డిజైన్‌తో రూపొందించిన బిగ్ బాస్ హౌస్‌ను నాగార్జున ప్రేక్షకులకు పరిచయం చేశారు. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఆటలో కొత్త రూల్స్, ఊహించని ట్విస్టులు ఉండబోతున్నాయనే సంకేతాలను లాంచ్ ఎపిసోడ్ నుంచే ఇచ్చారు.
“ఈసారి ఆటలో సవాల్ కాదు.. ఆటే ఒక సవాల్” అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ సీజన్‌పై అంచనాలను మరింత పెంచింది. కంటెస్టెంట్లను ఒక్కొక్కరిని తనదైన శైలిలో పరిచయం చేస్తూ, వారి వ్యక్తిత్వాలను ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నం చేశారు. నాగార్జున ఎనర్జీ, టైమింగ్ మరోసారి బిగ్ బాస్ షోకు ప్రధాన బలంగా నిలవబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Bigg Boss Telugu 10: Meet the 16 Contestants
తొలి కంటెస్టెంట్‌గా దేబ్జానీ మోదక్
బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లోకి తొలి కంటెస్టెంట్‌గా నటి దేబ్జానీ మోదక్ అడుగుపెట్టారు. బెంగాలీ, తమిళ్, తెలుగు టెలివిజన్ రంగాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న దేబ్జానీ.. తెలుగు ప్రేక్షకులకు సీరియల్స్ ద్వారా సుపరిచితురాలు. బుల్లితెరపై సంపాదించుకున్న గుర్తింపుతో బిగ్ బాస్ హౌస్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
రెండో కంటెస్టెంట్‌గా త్రిగుణ్
సినిమా రంగం నుంచి నటుడు త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) రెండో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు చిత్రాలతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ నటించిన త్రిగుణ్.. బిగ్ బాస్ వేదికపై తనలోని మరో కోణాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ‘చెన్నై లవ్‌స్టోరీ’ చిత్రంలోని పాత్రతో తనదైన నటనతో ఆకట్టుకున్న ఆయన ఆటతీరు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
అగ్నిపరీక్ష విజేత ఝాన్సీకి డైరెక్ట్ ఎంట్రీ
ఈసారి బిగ్ బాస్‌లో సామాన్యులకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ‘అగ్నిపరీక్ష’ ద్వారా పోరాడి అవకాశం దక్కించుకున్న ఫోక్ సింగర్ ఝాన్సీ మూడో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు. టాస్కుల్లో తన ప్రతిభను నిరూపించుకుని డైరెక్ట్ ఎంట్రీ సాధించిన ఝాన్సీ.. కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి వచ్చిన తొలి కంటెస్టెంట్‌గా ప్రత్యేక గుర్తింపు పొందారు.
కంటెంట్ క్రియేటర్ సుధీర్ కుమార్ రెడ్డి
నాలుగో కంటెస్టెంట్‌గా సుధీర్ కుమార్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. కంటెంట్ క్రియేటర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తన వ్యక్తిగత ప్రయాణం గురించి నాగార్జునతో పంచుకుంటూ బిగ్ బాస్ స్టేజ్‌పై కనిపించారు. సోషల్ మీడియా ప్రపంచం నుంచి వచ్చిన ఆయన హౌస్‌లో ఎలాంటి గేమ్ ఆడతారనేది చూడాలి.
గోల్డెన్ బజర్‌తో అమన్ ఎంట్రీ
సామాన్యుల విభాగం నుంచి అమన్ మసూద్ కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. గోల్డెన్ బజర్ ద్వారా ప్రత్యేక అవకాశం దక్కించుకుని ప్రధాన హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయనపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
చైత్ర రాయ్.. బుల్లితెర నుంచి బిగ్ బాస్‌కు
టెలివిజన్ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి చైత్ర రాయ్ కూడా ఈ సీజన్లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న చైత్ర.. బిగ్ బాస్ హౌస్‌లో తన అసలైన వ్యక్తిత్వాన్ని ఎలా చూపిస్తారనేది ఆసక్తికరం.
జబర్దస్త్ నుంచి ఆటో రాంప్రసాద్
కామెడీ షోల ద్వారా ప్రేక్షకులకు చేరువైన ఆటో రాంప్రసాద్ కూడా బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చారు. తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచే రాంప్రసాద్.. బిగ్ బాస్ హౌస్‌లో మాత్రం ఎంత సీరియస్‌గా గేమ్ ఆడతారనేది చూడాలి. కామెడీతో పాటు స్ట్రాటజీని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఈ సీజన్లో ఆసక్తికర అంశంగా మారనుంది.
కామనర్ శాలిని పటేల్
‘అగ్నిపరీక్ష’ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన మరో కామనర్ శాలిని పటేల్. సెలబ్రిటీలకు పోటీగా నిలబడేందుకు ఆమె సిద్ధమయ్యారు. బిగ్ బాస్ వంటి భారీ వేదికపై తనకంటూ గుర్తింపు సంపాదించుకోవాలనే లక్ష్యంతో వచ్చిన శాలిని.. ప్రేక్షకుల మద్దతును ఎంత వరకు పొందగలరో చూడాలి.
నటుడు టెంపర్ వంశీ
తొమ్మిదో కంటెస్టెంట్‌గా నటుడు టెంపర్ వంశీ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమా రంగంలో నటుడిగా గుర్తింపు పొందిన ఆయన.. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తన పేరుకు తగ్గట్టే హౌస్‌లో టెంపర్ చూపిస్తారా? లేక కూల్‌గా గేమ్ ఆడతారా? అనేది చూడాలి.
కామనర్ శ్రష్టి వర్మ
అగ్నిపరీక్షలో చివరి వరకు పోరాడిన శ్రష్టి వర్మ కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమెకు ఈసారి బిగ్ బాస్ ప్రధాన వేదికగా మారింది.
జబర్దస్త్ నరేష్
కామెడీ ప్రపంచం నుంచి బిగ్ బాస్‌లోకి వచ్చిన మరో వ్యక్తి జబర్దస్త్ నరేష్. కామెడీ షోల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఆయన ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో తన కొత్త జర్నీ మొదలుపెట్టారు.
హౌస్‌లో కామెడీతో అందరినీ అలరిస్తూనే గేమ్‌లో ఎంత సీరియస్‌గా ఉంటారనేది ఆసక్తికరం.
ఆర్జే చరణ్ మహదేవ్
బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన మరో ఆసక్తికర కంటెస్టెంట్ ఆర్జే చరణ్ మహదేవ్. అగ్నిపరీక్షలో తన ప్రతిభను ప్రదర్శించిన ఆయన ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ఈ భారీ వేదికపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
రేడియో రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చరణ్.. మాట్లాడే నైపుణ్యాన్ని బిగ్ బాస్ గేమ్‌లో ఎంత వరకు ఉపయోగించుకుంటారనేది ఆసక్తికరం.
నటుడు కృష్ణుడు
తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేరు కృష్ణుడు. ‘వినాయకుడు’ సినిమాతో హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న కృష్ణుడు.. ఇప్పుడు బిగ్ బాస్ వేదిక ద్వారా మరోసారి ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆయన అనుభవం, వ్యక్తిత్వం హౌస్‌లో ఎలా కనిపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
యాంకర్ వర్షిణి సౌందరరాజన్
యాంకర్‌గా, నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వర్షిణి సౌందరరాజన్ కూడా బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చారు. టెలివిజన్ షోలతో పాటు సినిమాల్లోనూ సందడి చేసిన వర్షిణికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఉన్న ఫ్యాన్ బేస్ బిగ్ బాస్ ప్రయాణంలో ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి. హౌస్‌లో ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫైనల్ కామనర్ రోహిత్ నాయుడు
కామనర్ కేటగిరీ నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన వారిలో రోహిత్ నాయుడు కూడా ఉన్నారు. ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా అవకాశం దక్కించుకున్న ఆయన ఈసారి సెలబ్రిటీ కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఎలాంటి సినీ లేదా టెలివిజన్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ప్రేక్షకుల మధ్య నుంచి వచ్చిన రోహిత్.. తన వ్యక్తిత్వంతో ఎంత వరకు ఆకట్టుకుంటారనేది చూడాలి.
సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడ
ఈ సీజన్లో చివరి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన వారిలో టెలివిజన్ నటుడు ముఖేష్ గౌడ ప్రత్యేకంగా నిలిచారు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఆయనకు బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది.

సెలబ్రిటీలు.. కామనర్స్ కలయిక
ఈసారి సీజన్లో నటీనటులు, టెలివిజన్ సెలబ్రిటీలు, కమెడియన్లు, యాంకర్లు, కంటెంట్ క్రియేటర్లతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించడం ప్రత్యేకతగా కనిపిస్తోంది. విభిన్న రంగాల నుంచి వచ్చిన వ్యక్తులు ఒకే హౌస్‌లో కలిసి ఉండటం వల్ల వ్యక్తిత్వాల మధ్య ఘర్షణలు, స్నేహాలు, వ్యూహాలు మరింత ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది.
నాగార్జునే బిగ్ బాస్‌కు స్పెషల్ అట్రాక్షన్
బిగ్ బాస్ తెలుగు తొలి రెండు సీజన్లకు ఎన్టీఆర్, నాని హోస్ట్‌లుగా వ్యవహరించగా.. మూడో సీజన్ నుంచి నాగార్జున ఈ షోకు ముఖచిత్రంగా మారిపోయారు. కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడటం, అవసరమైన సమయంలో స్ట్రిక్ట్‌గా ఉండటం, వీకెండ్ ఎపిసోడ్స్‌లో తప్పొప్పులను విశ్లేషించడం నాగార్జున హోస్టింగ్ ప్రత్యేకత.
ఇప్పుడు పదో సీజన్లో కూడా నాగార్జున హోస్టింగ్ ప్రేక్షకులకు ప్రధాన ఆకర్షణ కానుంది. గ్రాండ్ లాంచ్‌లోనే ఆయన చూపించిన ఎనర్జీ చూస్తుంటే.. ఈసారి వీకెండ్ ఎపిసోడ్స్ మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నాయని అభిమానులు భావిస్తున్నారు.
మొత్తానికి సెలబ్రిటీలు, కామనర్స్ కలయిక.. దశావతారం థీమ్.. కొత్త హౌస్.. కొత్త టాస్కులు.. అన్నింటికీ మించి కింగ్ నాగార్జున హోస్టింగ్‌తో బిగ్ బాస్ తెలుగు 10 ఘనంగా ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో హౌస్‌లో ఎవరి ఆట ఎలా సాగుతుంది? తొలి కెప్టెన్ ఎవరు? మొదటి వారంలోనే ఎలాంటి గొడవలు చోటుచేసుకుంటాయి? అనే ప్రశ్నలతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. పదో సీజన్ ప్రేక్షకులకు ఎంతటి వినోదాన్ని అందిస్తుందో చూడాలి.