Sridhar Gade’s New Horror Film Begins
‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీధర్ గాదె మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ నిర్మాత వెంకట్ తలారి నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
Sridhar Gade’s New Horror Film Begins
శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఇప్పటికే ఆది సాయి కుమార్ హీరోగా ‘చుట్టాలబ్బాయ్’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను, ఆనంద్ దేవరకొండతో విభిన్నమైన థ్రిల్లర్ ‘హైవే’ను నిర్మించిన వెంకట్ తలారి, ఇప్పుడు తమ బ్యానర్లో మూడో చిత్రంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు హీరోగా నటిస్తున్నారు. నందు, లిఖిత హీరోయిన్లుగా కనిపించనుండగా, పూజిత పొన్నాడ, సింధు కాసారం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
హైదరాబాద్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి క్లాప్ ఇవ్వగా, దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్‌ను అందజేశారు. దర్శకుడు వీరభద్రం చౌదరి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ చిత్రబృందానికి అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణతో మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో హారర్ ఎంటర్టైనర్
గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్నమైన హారర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. సరికొత్త కథ, ఆసక్తికరమైన కథనంతో దర్శకుడు శ్రీధర్ గాదె ఈ సినిమాను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా వినూత్నంగా ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్, షూటింగ్ షెడ్యూల్స్‌తో పాటు ఇతర వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.