సహజత్వానికి చిరునామా సాయి పల్లవి

తనదైన నటనతో ఆకట్టుకుంటూ సౌత్‌తోపాటు నార్త్‌లోనూ ఆకట్టుకుంది సాయి పల్లవి. నేచురల్ పెర్ఫార్మెన్స్, డ్యాన్స్‌లో డిఫరెంట్ స్టైల్, క్యారెక్టర్ సెలక్షన్‌లో తన జడ్జిమెంట్.. ఇవన్నీ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. మే 9 న ఆమె పుట్టినరోజు సందర్భంగా తన కెరీర్‌‌, పర్సనల్ లైఫ్​ గురించి ఒక లుక్కేద్దాం.

1992 మే 9న తమిళనాడులో జన్మించిన సాయి పల్లవి పూర్తి పేరు సాయి పల్లవి సెంటమరై కన్నన్. చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌పై ఆసక్తి. టెలివిజన్ డ్యాన్స్ షోల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత జార్జియాలోని మెడికల్ యూనివర్సిటీలో మెడిసన్ చదివింది. యాక్టింగ్‌లోకి రాకముందు ఆమె డాక్టర్ చదవడం వెరీ స్పెషల్ అని చెప్పుకోవాలి.

2015లో విడుదలైన ‘ప్రేమమ్’ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి తనదైన నేచురల్ నటనతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. అందులోని ‘మలర్’ పాత్ర ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ పాత్రలో కనిపించిన సహజత్వం, మేకప్ లేకుండా తెరపై కనిపించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చింది. అదే సినిమాతో ఆమెకు భారీ గుర్తింపు వచ్చింది. వరుణ్ తేజ్‌కి జంటగా నటించిన ‘ఫిదా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి .. తనదైన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. ఆ చిత్రంలో భానుమతి పాత్రలో ఆమె చూపిన చలాకీతనం, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఆ చిత్రంతో ఆమె తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తర్వాత నాగ చైతన్యతో కలిసి నటించిన ‘లవ్‌ స్టోరీ’లో సూపర్బ్‌ పెర్ఫార్మెన్స్‌తో ఇంప్రెస్ చేసింది. డ్యాన్సింగ్ క్వీన్‌లా ఆ చిత్రంలో ఆమె చేసిన డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేసి… తనను నెక్స్ట్ లెవల్‌లో నిలబెట్టింది. ఇక నానితో ‘శ్యామ్‌ సింగరాయ్’ మూవీలో క్లాసికల్ డ్యాన్సర్‌‌గా తనదైన నటనతో మరోసారి మెప్పించింది. శివ కార్తికేయన్‌తో ‘అమరన్‌’లో నటించిన సాయి పల్లవి ఈచిత్రంలోనూ సహజ నటనను ప్రూవ్ చేసింది. అలాగే ఆమె లీడ్‌ రోల్‌లో నటించిన ‘గార్గి’లోనూ సంప్రదాయబద్దంగా కనిపించి ఆకట్టుకుంది. రీసెంట్‌గా ‘తండేల్‌’లోనూ మరోసారి నాగ చైతన్యతో నటించి మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆమీర్ ఖాన్ కొడుకిగా జంటగా ‘ఏక్‌ దిన్’ మూవీలో నటించి నార్త్‌లోనూ తనేంటో సత్తా చాటింది. ఈ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు ఎంచుకుని నటిగా తన పరిధిని మరింత విస్తరించింది.

సాయి పల్లవి కెరీర్‌లో ప్రత్యేకంగా కనిపించే అంశం పాత్రల ఎంపిక. ప్రతి సినిమా చేయాలనే తొందర కంటే, కథలో తన పాత్రకు బలం ఉందా లేదా అన్నదే ఆమెకు ముఖ్యం. అందుకే ఆమె ఫిల్మోగ్రఫీ సంఖ్యలో పెద్దది కాకపోయినా, గుర్తుండిపోయే పాత్రలతో నిండి ఉంది. గ్లామర్‌కి ప్రాధాన్యం ఇచ్చే సినీ రంగంలో కూడా ఆమె తన సహజ రూపాన్ని, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంది. యోగా, ధ్యానం, క్రమశిక్షణ ఆమె జీవనశైలిలో భాగం అని పలు ప్రొఫైల్స్ సూచిస్తున్నాయి. వ్యక్తిగత జీవితాన్ని ఆమె చాలా ప్రైవేట్‌గా ఉంచుతుంది. కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటుందని, ముఖ్యంగా తన చెల్లెలుతో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉందని పలుమార్లు బయటపడింది. సోషల్ మీడియాలో కూడా వ్యక్తిగత జీవితాన్ని కంటే తన పని, కుటుంబ క్షణాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.

సాయి పల్లవి గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు :
డాక్టర్ కూడా — చాలా మందికి తెలిసిన విషయమే అయినా, స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తర్వాత కూడా ఆమెకు మెడిసిన్ నేపథ్యం ఉండటం ప్రత్యేకం.
సెల్ఫ్-టాట్డ్ డ్యాన్సర్ — ప్రొఫెషనల్ డ్యాన్స్ ట్రైనింగ్ లేకుండానే తన స్టైల్‌తో గుర్తింపు తెచ్చుకుంది. “రౌడీ బేబీ” వంటి పాటల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది.
మేకప్ లేకుండా బ్రేక్‌థ్రూ — Premamలో మేకప్ లేకుండా కనిపించడం అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
పాత్రల ఎంపికలో కఠిన ప్రమాణాలు — కథ, పాత్ర బలం ఉంటేనే సినిమాలు ఒప్పుకోవడం ఆమె కెరీర్‌లో కనిపించే ముఖ్య లక్షణం.
ఫ్యాన్ కమ్యూనిటీలో ‘నేచురల్ స్టార్’ — అభిమానులు ఆమెను ఎక్కువగా “నేచురల్ పెర్ఫార్మర్”గా అభివర్ణిస్తుంటారు. ఈరోజు సోషల్ మీడియా చర్చల్లో కూడా అదే స్పష్టంగా కనిపిస్తోంది.

సాయి పల్లవి కెరీర్‌ను పరిశీలిస్తే, అది కేవలం స్టార్‌డమ్ కథ కాదు. కమర్షియల్ సినిమాల్లోనూ, పాత్రాధారిత చిత్రాల్లోనూ తనదైన ముద్ర వేసిన ప్రయాణం. తెరపై సహజత్వం, తెర వెనుక వ్యక్తిత్వం ఈ రెండూ కలిసే ఆమెను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి.

Related Posts

హారతి ప్లేటుతో.. చిరు నవ్వులు చిందిస్తూ..

దాదాపు 27 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది అందాల తార త్రిష. ఇప్పటికీ అదే అందం, మరింత గ్లామర్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఆమె సోమవారం పుట్టినరోజు సందర్భంగా సినీ…

తొక్కలో ఇంటర్వ్యూ

క్యాస్ట్ విషయంలో జాఫర్ – గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను! ప్రముఖ నటుడు గెటప్ శ్రీను తాజాగా జర్నలిస్ట్ జాఫర్ కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…

One thought on “సహజత్వానికి చిరునామా సాయి పల్లవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

  • By Nani
  • May 18, 2026
  • 3 views
పెద్ది  ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

  • By Nani
  • May 18, 2026
  • 8 views
కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

  • By Nani
  • May 17, 2026
  • 4 views
చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

  • By Nani
  • May 17, 2026
  • 5 views
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

  • By Nani
  • May 17, 2026
  • 12 views
‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

రాజస్థాన్‌లో ‘వృషకర్మ’

  • By Nani
  • May 17, 2026
  • 7 views
రాజస్థాన్‌లో ‘వృషకర్మ’