మీరు ఏం ఇట్లు.. చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ‘ఎపిక్’

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ‘90స్’ వెబ్ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ రూపొందించిన చిత్రం ‘ఎపిక్.. ఫస్ట్ సెమిస్టర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కంటెంట్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేయగా, తాజాగా వచ్చిన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచింది. ఒక ఇంటెన్స్ లవ్‌స్టోరీతో యూత్‌ టార్గెట్‌గా టీజర్‌‌ను కట్ చేసిన తీరు ఆకట్టుకుంది. టీజర్‌లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘బేబీ’ సినిమా తర్వాత ఈ జంటకు మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పుడు అదే జంట మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. సహజమైన కథనం, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే ఆదిత్య హాసన్ స్టైల్ ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన “సంచారమే” పాట ఇప్పటికే మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అదే తరహాలో టీజర్‌లో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. లండన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా, నేటి జనరేషన్‌ సరిపడా లవ్‌స్టోరీగా రూపొందింది. ఇంట్రోవర్ట్ పాత్రలో ఆనంద్ దేవరకొండ, ఎక్స్‌ట్రోవర్ట్ పాత్రలో వైష్ణవి చైతన్య కనిపించడం కథకు కొత్త డైనమిక్స్‌ను తీసుకువస్తోంది. ఇద్దరి మధ్య కిస్ వస్తున్న తరుణంలో వైష్ణవి చైతన్య హీరోని ‘మీరు ఏం ఇట్లు’ అని అడగటం ఇందులో కులాల ప్రస్తావన కూడా తెచ్చినట్టు కనిపిస్తోంది. విభిన్న స్వభావాలున్న ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది, ఎలా ముందుకు సాగింది అన్నది టీజర్‌లో అద్భుతంగా చూపించారు.

టీజర్ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించిన చిత్ర యూనిట్ తమ అనుభవాలను పంచుకుంది.
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. “ఎపిక్ టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ సినిమా చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆదిత్య హాసన్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది. ఎందుకంటే నేనూ విదేశాల్లో చదువుతున్నాను. ఇందులోని చాలా సన్నివేశాలు నాకు కనెక్ట్ అయ్యాయి. విదేశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళకు మాత్రమే కాదు.. ఈ కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి. కుటుంబం, ప్రేమ, బంధం, భావోద్వేగాలు ఇలా ప్రతిదీ మీ మనసుకు నచ్చుతాయి. దర్శకుడు ఆదిత్య హాసన్ లో ఎంతో ప్రతిభ ఉంది. భవిష్యత్తులో ఆదిత్యను స్ఫూర్తిగా తీసుకొని ఎందరో కొత్త దర్శకులు వస్తారు. వైష్ణవి చైతన్య లాంటి ప్రతిభగల నటితో నటించడం సంతోషంగా ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి సంస్థలో సినిమా చేయడం ఆనందంగా ఉంది. సార్, లక్కీ భాస్కర్, టిల్లు, మ్యాడ్, జెర్సీ లాంటి సినిమాల సరసన ఎపిక్ చేరుతుందనే నమ్మకం ఉంది. మన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఇది మన కథే కదా అనిపిస్తుంది. ఇందులో హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం మనసు పెట్టి పనిచేశారు.” అన్నారు.

కథానాయిక వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. “ముందుగా ‘సంచారమే’ పాటపై ప్రేమను కురిపించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. ఎపిక్ కథ నాకు చాలా నచ్చింది. కథ వినగానే నేను ఈ సినిమాలో భాగం కావాలి అనుకున్నాను. నేను పోషించిన కడలి పాత్ర చాలా బాగుంటుంది. కథ వినేటప్పుడు ఆ కడలి నాలో ఉందేమో అనిపించింది. చాలామంది అమ్మాయిల్లో ఆ కడలి ఉంటుంది అనిపించింది. ఆనంద్ పోషించిన ఆదిత్య పాత్ర కూడా బాగుంటుంది. ఈ సినిమాలోని ప్రతి పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. ఎపిక్ నా మనసుకి దగ్గరైన సినిమా. ఇదొక అందమైన ప్రేమ కథ. మనల్ని మనం చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది. సినిమా చూస్తుంటే మన స్నేహితులు గుర్తుకొస్తారు. మీ కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.” అన్నారు.

దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ప్రతి ఒక్కరికీ చేరువయ్యే ప్రేమకథ. కథ రాస్తున్నప్పుడు, తీస్తున్నప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందని నమ్మాను. చిత్ర విజయం పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాము. బంధాలను, భావోద్వేగాలను గొప్పగా చూపించడానికి మా శాయశక్తులా కృషి చేశాము. ఇది కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రం. 90’s వెబ్ సిరీస్‌ తీసినట్టుగానే ఈ సినిమాను కూడా సహజంగా తెరకెక్కించాము. మీ తల్లిదండ్రులతో కలిసి ఈ సినిమాను చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను.” అన్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేస్తోంది. అజీమ్ మహమ్మద్ ఛాయాగ్రాహకుడిగా పని చేస్తున్న ఈ చిత్రానికి కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే “సంచారమే” గీతం మ్యూజికల్ హిట్‌గా నిలవగా, తాజాగా విడుదలైన టీజర్ అందరినీ కట్టిపడేస్తోంది. ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి భారీ విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలో సినిమాకు సంబందించిన మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్ రానున్నాయి.

Related Posts

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

నటుడిగా కెరీర్ ప్రారంభించి, అగ్ర నిర్మాతగా ఎదిగి టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న బండ్ల గణేష్ ఇంట్లో ఆదివారం ఆనందం వెల్లివిరిసింది. ఆయన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఘనంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడగా, సినీ రాజకీయ ప్రముఖుల రాకతో కార్యక్రమం మరింత…

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

గోపీచంద్ హీరోగా తన 34వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రంతో ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

  • By Nani
  • May 3, 2026
  • 4 views
బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

  • By Nani
  • May 3, 2026
  • 9 views
ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

  • By Nani
  • May 3, 2026
  • 10 views
‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

  • By Nani
  • May 3, 2026
  • 21 views
రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

  • By Nani
  • May 2, 2026
  • 6 views
టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్

  • By Nani
  • May 2, 2026
  • 7 views
ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్