కొన్ని కథలు ఓపిక కోరుతాయి.. కానీ గర్వపడేలా చేస్తాయి

కొన్ని కథలు ఓపిక కోరుతాయి. కానీ గర్వపడేలా చేస్తాయి
‘టాక్సిక్’ మరోసారి వాయిదా.. గ్లోబల్ రిలీజ్ కోసం యశ్ భారీ ప్లాన్

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ Yash అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్- గ్లోబల్ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్’ విడుదల మరోసారి వాయిదా పడింది. గీతూ మోహన్ దాస్ Geethu Mohandas దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వాస్తవానికి మార్చి 19న విడుదల కావాల్సి ఉండగా, తర్వాత అనివార్య కారణాలతో జూన్ 4కి మారింది. అయితే తాజాగా మరో కీలక ప్రకటన చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థలు కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ జూన్ 4న కూడా సినిమా విడుదల కావడం లేదని స్పష్టం చేశాయి. దీంతో ‘టాక్సిక్’ రిలీజ్ మరోసారి పోస్ట్‌పోన్ అయినట్టైంది.

ఈ సినిమా ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా సినిమాకాన్‌లో వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత, ఈ సినిమాను మరింత విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ “ఈ సినిమా మాకెంతో స్పెషల్. ఇండియన్ సినిమా గ్లోబల్ స్టేజ్‌పై మరింత బలంగా నిలబడుతున్న ఈ సమయంలో, మనం కూడా స్థాయిని పెంచాల్సిన అవసరం ఉంది. ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా తన పూర్తి సామర్థ్యంతో ప్రేక్షకులను చేరాలి” అని అన్నారు. అలాగే అభిమానుల మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, “కొన్ని కథలు ఓపిక కోరుతాయి. కానీ చివరికి మీరు గర్వపడే సినిమా అందిస్తాం” అని యశ్ హామీ ఇచ్చారు. ఇప్పటికైతే కొత్త రిలీజ్ తేదీని ప్రకటించకపోయినా, ‘టాక్సిక్’ను గ్లోబల్ స్థాయిలో భారీగా విడుదల చేయడానికి టీమ్ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోందని తెలుస్తోంది. ఈ నిర్ణయం అభిమానులకు నిరాశ కలిగించినా, అంతర్జాతీయ స్థాయిలో మరింత పెద్ద అనుభవం అందించబోతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని తెలియజేశారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరించిన ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా నటించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది.

Related Posts

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

నటుడిగా కెరీర్ ప్రారంభించి, అగ్ర నిర్మాతగా ఎదిగి టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న బండ్ల గణేష్ ఇంట్లో ఆదివారం ఆనందం వెల్లివిరిసింది. ఆయన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఘనంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడగా, సినీ రాజకీయ ప్రముఖుల రాకతో కార్యక్రమం మరింత…

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

గోపీచంద్ హీరోగా తన 34వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రంతో ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

  • By Nani
  • May 3, 2026
  • 4 views
బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

  • By Nani
  • May 3, 2026
  • 9 views
ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

  • By Nani
  • May 3, 2026
  • 10 views
‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

  • By Nani
  • May 3, 2026
  • 21 views
రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

  • By Nani
  • May 2, 2026
  • 6 views
టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్

  • By Nani
  • May 2, 2026
  • 7 views
ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్