చరణ్ – అఖిల్ మధ్య బంధం మాటల్లోనేనా?

చరణ్ –‌‌– అఖిల్ మధ్య బంధం మాటల్లోనేనా?
‘‘పెద్ది’’, ‘‘లెనిన్” మధ్య బాక్సాఫీస్ వార్‌కు రంగం సిద్ధం!

టాలీవుడ్‌లో మరోసారి బాక్సాఫీస్ పోరు వేడెక్కేలా కనిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ జూన్ 25న విడుదలకు సిద్ధమవుతుండగా, అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ను జూన్ 26న రిలీజ్ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మొదటగా ‘లెనిన్’ సినిమాను మే 1న విడుదల చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్, అప్పట్లో ‘పెద్ది’ ఏప్రిల్ 30న వస్తుందని ప్రకటించడంతో దాన్ని దృష్టిలో ఉంచుకుని రిలీజ్ డేట్‌ను మార్చుకున్నామని చెప్పారు. ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయ సంబంధాన్ని గౌరవిస్తూ క్లాష్‌ను నివారించాలనుకున్నామని అప్పుడు ఓ నోట్ ద్వారా స్పష్టం చేశారు. తర్వాత ‘పెద్ది’ కూడా పోస్ట్ పోన్ అయ్యి జూన్‌ 25కు వస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మొత్తం పరిణామాలు పూర్తిగా మారిపోయినట్టే ఉంది. ఒక్క రోజు గ్యాప్‌తో రెండు సినిమాలు విడుదలవ్వడం ఖాయమవడంతో, మరోసారి బాక్సాఫీస్ వద్ద చరణ్ – అఖిల్ మధ్య పోటీ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోసారి ‘లెనిన్’ వాయిదా పడుతుందని అంతా భావించారు. కానీ బుధవారం అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్‌తో ‘లెనిన్‌’ విషయంలో తాము తగ్గేదేలే అంటున్నారు. ఆయన చేసిన ట్వీట్‌తో అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న ‘లెనిన్’పై అంచనాలు మరింత పెంచాయి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ కట్‌ను చూసిన నాగార్జున, తన ఆనందాన్ని, నమ్మకాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. “నిన్న రాత్రి మా ‘లెనిన్’ సినిమా ఫస్ట్ కట్ చూశాను. చాలా గర్వంగా, నమ్మకంగా చెబుతున్నాను. జూన్ 26, 2026న మీరు ఒక కొత్త అఖిల్‌ను చూడబోతున్నారు. ఆ తేదీని గుర్తుంచుకోండి. థియేటర్లలో కలుద్దాం” అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో అఖిల్ అక్కినేని నటనపై, సినిమాలోని ఆయన పాత్రపై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటివరకు చేసిన సినిమాలకంటే భిన్నంగా, కొత్త లుక్ మరియు పెర్ఫార్మెన్స్‌తో అఖిల్ కనిపించనున్నాడనే సంకేతాలు ఈ ట్వీట్ ద్వారా స్పష్టమవుతున్నాయి.
ఈ తాజా పరిణామాలతో అభిమానుల్లో చర్చ మొదలైంది. “ఆత్మీయ బంధం ఉందని చెప్పి వాయిదా వేసిన సినిమా.. ఇప్పుడు అదే బంధం ఎక్కడికి పోయింది?” అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరికొందరు మాత్రం రెండు పెద్ద సినిమాలు వచ్చినా ఏం పర్వాలేదని వాదనలు చేస్తున్నారు. కానీ స్టార్ హీరోల సినిమాలు కావడంతో ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మొత్తానికి, ఒకప్పుడు ‘బంధం’ పేరుతో క్లాష్‌ను తప్పించుకున్న ఈ రెండు సినిమాలు ఇప్పుడు మళ్లీ పోటీకి సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ వార్‌లో ఎవరు విజేతగా నిలుస్తారు? లేక ఇద్దరూ విన్-విన్ పరిస్థితి సాధిస్తారా? అన్నది జూన్ చివరి వారంలో తేలనుంది.

 

Related Posts

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

నటుడిగా కెరీర్ ప్రారంభించి, అగ్ర నిర్మాతగా ఎదిగి టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న బండ్ల గణేష్ ఇంట్లో ఆదివారం ఆనందం వెల్లివిరిసింది. ఆయన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఘనంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడగా, సినీ రాజకీయ ప్రముఖుల రాకతో కార్యక్రమం మరింత…

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

గోపీచంద్ హీరోగా తన 34వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రంతో ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

  • By Nani
  • May 3, 2026
  • 4 views
బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

  • By Nani
  • May 3, 2026
  • 9 views
ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

  • By Nani
  • May 3, 2026
  • 10 views
‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

  • By Nani
  • May 3, 2026
  • 21 views
రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

  • By Nani
  • May 2, 2026
  • 6 views
టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్

  • By Nani
  • May 2, 2026
  • 7 views
ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్