రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

రివ్యూ : వాలా 2

నటీనటులు :- హషీర్ హెచ్, అలెన్ బిన్ సిరాజ్, బిజు కుట్టన్, అజిన్ జాయ్, వినాయక్ వి, అష్నా, సాషా ఇస్లా, వేద శంకర్, ‘ప్రేమమ్’ దర్శకుడు అల్ఫోన్స్ పుతిరిన్ తదితరులు
దర్శకత్వం : సావిన్ ఎస్‌ఏ
రచయిత ‌‌: విపిన్ దాస్
ప్రొడ్యూసర్స్ : సాహు గారపాటి, విపిన్ దాస్, హర్రిస్ దేశోమ్, పీబీ అనిష్, ఆదర్శ్ నారాయణ్
సినిమాటోగ్రఫీ : అఖిల్ లైలాసురన్
ఎడిటర్ : కన్నన్ మోహన్
మ్యూజిక్ -: ఏ టీమ్
విడుదల తేదీ : ఏప్రిల్ 24, 2026
నిడివి : 164 నిమిషాలు

మలయాళంలో మెప్పించిన ‘వాలా 2’ చిత్రం శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. పదికోట్ల లిమిటెడ్ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మలయాళ బాక్సాఫీస్ దగ్గర దాదాపు రెండు వందల కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. యూత్‌ఫుల్, ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్‌ను ఏవిధంగా ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ విషయానికొస్తే : నలుగురు స్నేహితుల జీవిత ప్రయాణాన్ని సహజంగా, హాస్యంతో, భావోద్వేగంతో చూపించడమే ఈ కథ. అల్లరిచిల్లరిగా తిరిగే నలుగురు ఫ్రెండ్స్ తమ జీవితాల్లో ఎదురయ్యే ఒత్తిడులు, సమాజం చేసే విమర్శలు, భవిష్యత్తుపై ఉన్న ఆలోచనల మధ్య ఎలా ముందుకు సాగారు అనేది ఆసక్తికరంగా చూపించారు. ముఖ్యంగా పిల్లల పెంపకంలో చేసే తప్పులకు కారణం తల్లిదండ్రులా, చదువులు చెప్పే టీచర్లదా అనే వివరణ ఇవ్వడం చాలామంచి పరిణామం. అలాగే యూత్‌లో ఉన్నప్పుడు చెడు వ్యసనాలు (డ్రగ్స్) బారినపడితే ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. చిన్న తప్పులకు పెద్ద శిక్ష అనుభవించాల్సి వస్తుందని, ఫారిన్ డ్రీమ్‌ ఉన్న వాళ్లు అక్కడ వారు ఎదుర్కొనే ఒంటరితనం, ఆర్థిక సమస్యలు, జీవన పోరాటమే ఈ కథ సారాంశం.

ఎవరెలా చేశారంటే : హషీర్, అలెన్, అజిన్, వినాయక్ ప్రధానంగా ఈ నాలుగు పాత్రల చుట్టూనే కథ తిరుగుతుంది. వీరు వారి పాత్రల్లో చాలా నేచురల్‌గా నటించారు. వారి నటన చూస్తే నిజ జీవితంలో ఉన్న యువకుల్లానే అనిపిస్తుంది. ఈ నిజాయితీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. స్కూల్‌ స్టేజ్‌లో చేసే అల్లర్లు, తర్వాత జీవిత పోరాటంలో తమను తాము మార్చుకున్న విధానం ఆకట్టుకుంది. అలాగే ఇతర నటీనటులు తమ పాత్ర పరిధిమేర ప్రతి ఒక్కరూ తమదైన పెర్ఫారెన్స్‌తో మెప్పించారు. అష్నాగా వేద శంకర్ (అలెన్ సోదరి), సజిన్‌గా దేవరాజ్ (అజిన్ అన్న), షైనాగా ఏంజెల్ మారియా (అమీన్ సోదరి), నషీర్‌‌గా సబారి (హషీర్ తమ్ముడు), మనోజ్ సర్‌‌గా అజు వర్గీస్‌, జేవియర్ అలెగ్జాండర్‌‌గా ‘ప్రేమమ్’ దర్శకుడు అల్ఫోన్స్ పుతిరిన్‌ , షియాస్‌గా సుధీష్‌ (అలెన్ తండ్రి), ముజీబ్ సర్‌‌గా విజయ్ బాబు, హషీర్ తల్లిగా అస్వతి చంద్ర కిశోర్‌‌, హెడ్‌మిస్ట్రెస్ గా రీనా ఇంద్రయాణి తమ తమ పాత్రల్లో జీవించారు.

ఎలా ఉందంటే :
ఫస్ట్ హాఫ్‌ అంతా కంప్లీట్ యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో ఎంటర్‌‌టైనింగ్‌గా సాగింది. సెకండాఫ్ మాత్రం కొంచెం సీరియస్‌గా మారి, భావోద్వేగాలను హైలైట్ చేస్తుంది. ముఖ్యంగా యువత ఎదుర్కొనే ఒత్తిడులు, సమాజం చేసే విమర్శలు, తల్లిదండ్రులతో ఉన్న సంబంధాలు చాలా సహజంగా చూపించారు. నలుగురు ఫ్రెండ్స్‌తో మొదట సరదాగా, కామెడీతో సాగిన వారి ప్రయాణం, క్రమంగా భావోద్వేగాలతో నిండిన దశకు చేరుతుంది. కుటుంబ సంబంధాలు, ఫ్రెండ్షిప్ విలువ, జీవితంలో సరైన మార్గాన్ని ఎన్నుకోవడం వంటి అంశాలు హైలైట్‌గా నిలుస్తాయి. చివరికి, ఈ నలుగురు స్నేహితులు తమ తప్పులు, అనుభవాల ద్వారా జీవితాన్ని ఎలా అర్థం చేసుకుంటారు, ఎలా మారుతారు అన్నది చూపించిన విధానం ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ఫాదర్ అండ్ సన్, బ్రదర్ అండ్ సిస్టర్, బ్రదర్స్ బాండింగ్, ఫ్రెండ్‌షిప్‌లోని ఎమోషన్‌ను చాలా బాగా చూపించారు. ఇవన్నీ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని సెటైరికల్ డైలాగ్స్ మరింత హాస్యాన్ని పంచుతాయి. అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో కొంత ల్యాగ్ అనిపించినా వెంటనే దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేయడం బాగుంది. హార్ట్‌ టచ్చింగ్ క్లైమాక్స్ మెస్మరైజింగ్‌గా ఉంటుంది. విదేశాల్లో గడిపే జీవితం, ఒంటరితనం, అక్కడ యువత ఎదుర్కొనే కష్టాలు చాలా రియలిస్టిక్‌గా చూపించారు.

ప్లస్ పాయింట్స్ :
ఫ్రెష్ కామెడీ
నేచురల్ పెర్ఫార్మెన్స్
ఎమోషనల్ డెప్త్

మైనస్:
ఫస్టాఫ్ కొంచెం అతిగా అనిపించవచ్చు

ఫైనల్‌గా : యూత్ సమస్యలు, పేరెంట్-చైల్డ్ రిలేషన్, ఫ్రెండ్స్ మధ్య బంధంతో కంప్లీట్ ఎంటర్‌‌టైనర్‌‌గా సాగిందీ చిత్రం. ముఖ్యంగా యువత తప్పకుండా చూడాల్సిన చిత్రం.

రేటింగ్ : 3.5/5

Related Posts

రివ్యూ : తిమ్మరాజుపల్లి టీవీ : అలనాటి జ్ఞాపకాలతో ఆకట్టుకునే తిమ్మరాజుపల్లి టీవీ

రివ్యూ : తిమ్మరాజుపల్లి టీవీ : అలనాటి జ్ఞాపకాలతో ఆకట్టుకునే తిమ్మరాజుపల్లి టీవీ నటీనటులు :- సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు రచన, ఎడిటింగ్, దర్శకత్వం – వి.…

రివ్యూ : పళ్లి చట్టంబి

రివ్యూ : పళ్లి చట్టంబి నటీనటులు :- టొవినో థామస్, కయదు లోహర్, విజయరాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెక్జాండర్, తదితరులు డైరెక్టర్ -: డిజో జోస్ ఆంటోనీ ప్రొడ్యూసర్స్ : – నౌఫల్, బ్రిజీష్, చాణక్య,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 3 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 4 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 6 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 6 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని