మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఆఫ్రికా, జార్జియా వంటి దేశాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేశారు మేకర్స్. గ్లోబల్ లెవల్లో హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో ప్రమోషన్స్ కూడా అదే లెవల్లో ఉండేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ గ్లోబల్ ప్రెజెంటేన్ను మెక్సికోలో నిర్వహిస్తున్నారు. ఈనెల 24న జరగనున్న ప్రతిష్ఠాత్మక CCXP 2026 ఈవెంట్లో ‘వారణాసి’ కోసం ఒక ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంతో సినిమా అంతర్జాతీయ ప్రమోషన్లు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.
ఈ కార్యక్రమంలో రాజమౌళితోపాటు మూవీ టీమ్ అంతా పాల్గొంటారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ‘బిహైండ్ ది సీన్స్’ (బీటీఎస్) వీడియోలను ప్రదర్శించనున్నారు. అలాగే, సినిమా మేకింగ్ విశేషాలను చిత్ర యూనిట్ అక్కడి ప్రేక్షకులతో పంచుకోనుంది. ప్రజెంటేషన్ పూర్తయిన తర్వాత చిత్ర బృందం ఆడియన్స్‌తో నేరుగా ముచ్చటించనుండటం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భారతీయ సంస్కృతి, పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రత్యేక ఈవెంట్ ద్వారా గ్లోబల్ ఆడియన్స్‌కు భారతీయ కథను కొత్తగా పరిచయం చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఇకపోతే ఈ మూవీ బ్యాలెన్స్ షూట్‌ను అంటార్కటికా, వియత్నాం, థాయ్‌లాండ్ లాంటి ప్రదేశాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. త్రైతా యుగం నుంచి కలియుగం వరకు టైమ్ ట్రావెల్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలను టచ్ చేస్తూ సాగే గ్లోబ్ ట్రాటర్ సినిమా ఇదని ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ ద్వారా సినిమాపై అంచనాలు పెంచారు. రణ కుంభ అనే విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై కేఎల్ నారాయణ, రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా విడుదల కానుంది.




