Vishal Makutam Releasedate update
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై 99వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘మకుటం’ సినిమాతో హీరో విశాల్ దర్శకుడిగానూ అరంగేట్రం చేస్తున్నారు. స్వర్గీయ ఆర్.బి. చౌదరి నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
Vishal Makutam Releasedate update
ఈ నేపథ్యంలో చిత్ర బృందం మరో క్రేజీ అప్డేట్ను ప్రకటించింది. ‘మకుటం’ను ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు వెల్లడించడంతో పాటు, ఆగస్ట్ 7న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో సినిమా ప్రమోషన్స్ మరింత జోరందుకోనున్నాయి.
విశాల్ ఈ చిత్రంలో విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నట్లు ఇప్పటికే టీజర్ ద్వారా స్పష్టమైంది. దర్శకుడిగా ఆయన తొలి ప్రయత్నం కావడం, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత ‘మకుటం’పై మరింత హైప్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.
జాన్ విజయ్, జయప్రకాశ్, అజయ్, వంశీ కృష్ణ, అబూ సలీం, అర్జయ్, ఝాన్సీ, పదం కుమార్, సభుమోన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ఎం. నాథన్, అభినందన్ రామానుజం సినిమాటోగ్రాఫర్లుగా, ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.