‘‘ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగ.. ఓ యమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టా ఎట్టాగా..” అంటూ ఫుల్ జోష్‌లో పాడుకుంటున్నాడు అఖిల్. తను హీరోగా మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘లెనిన్’ చిత్రంలోని పాట ఇది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన తొలి సాంగ్ ‘వారేవా వారేవా..’కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎట్టా ఎట్టా..’ అనే సాంగ్ రెండో పాట విడుదలైంది. ఈ మాస్ మెలోడీ సాంగ్‌ను తమన్ కంపోజ్ చేయడంతో పాటు శ్రీకృష్ణతో కలిసి పాడటం హైలైట్‌గా నిలిచింది. ‘‘రెండు కళ్లు సరిపోతలే.. రెప్ప మూయాలి అనిపిస్తలే.. నువ్వు తప్ప కనిపిస్తలే.. నీలా ఎవ్వరు అనిపిస్తలే.. నడుమేమో జానెడు జానెడు.. ఆ జడ చూస్తే బారెడు బారెడు.. తల్లో మడిచి ఎట్టుకున్న మల్లెపూలు మూరెడు.. నిన్ను ఎట్టా చెక్కాడే దేవుడు..” అంటూ భాస్కరభట్ల రాసిన చక్కటి సాహిత్యం ఆకట్టుకుంది. బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో అఖిల్ తన మాస్ స్టెప్స్‌తో అదరగొడుతుంటే, భాగ్యశ్రీ తన చార్మ్‌తో స్క్రీన్‌పై మెప్పిస్తోంది. ఈ ఇద్దరి జోడీ చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. జూన్ 26న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కాబోతోంది.





