Sai Pallavi Stunning Transformation For InjiVellam
సినిమా సినిమాకు కొత్తగా కనిపించడం ఒక ఎత్తయితే.. ప్రతి పాత్రలోనూ పూర్తిగా ఒదిగిపోవడం మరో ఎత్తు. అందులోనూ గ్లామర్ కంటే నటనకు, స్టార్ ఇమేజ్ కంటే పాత్రకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న హీరోయిన్ సాయి పల్లవి. తన సహజమైన నటన, అద్భుతమైన డ్యాన్స్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ మలయాళ కుట్టి.. ఇప్పుడు మరోసారి తన డిఫరెంట్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Sai Pallavi Stunning Transformation For InjiVellam
ఇటీవల సాయి పల్లవి నటించిన ప్రాజెక్టులను గమనిస్తే ఆమె ఎంచుకుంటున్న పాత్రల్లో ఎంత వైవిధ్యం ఉందో అర్థమవుతుంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘రామాయణ’లో సీతగా కనిపించి
పౌరాణిక పాత్రలోనూ మెప్పించింది. మరోవైపు ‘ఓం’ (OM: Operation Mole) చిత్రంలో నిత్యారెడ్డి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెస్మరైజ్ చేసింది. ఈ పాత్ర కోసం పొట్టి జుట్టుతో పూర్తిగా భిన్నమైన లుక్‌ను ఎంచుకుంది.
ఇప్పుడు దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘ఇంజి వెల్లం’ (Inji Vellam) సినిమాలోనూ సాయి పల్లవి మరో ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతోంది. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె గర్భిణీ మహిళగా కనిపించడం విశేషం. తాజాగా విడుదలైన ‘ఆచి ఆచి’ (Aachi Aachi) పాటలో సాయి పల్లవి లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పొట్టి జుట్టుతో, పూలతో అలంకరించుకున్న హెయిర్ స్టైల్లో కనిపిస్తూ.. కొన్ని యానిమేషన్ దృశ్యాల్లో గర్భిణీగా దర్శనమిస్తోంది. ఒక జంట పరిచయం నుంచి కుటుంబ జీవితంలోని మధురమైన దశల వరకు సాగే ప్రయాణాన్ని ఈ పాటలో చూపించారు.
https://x.com/Pinkvillat24/status/2125570040313581819
ఈ పాటకు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. సాయి పల్లవి ఎనర్జిటిక్ డ్యాన్స్‌కు కూడా మంచి స్పందన వస్తోంది. తమిళ, మలయాళ సంగీత ప్రభావాలను కలగలిపిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సాయి పల్లవి షార్ట్ హెయిర్ లుక్, గర్భిణీ మహిళగా ఆమె కనిపించిన తీరు గురించి నెటిజన్లు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. సాయి పల్లవి ప్రతి పాత్రకు తన రూపాన్ని, బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవడానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందనేది. సీతగా కనిపించాల్సినప్పుడు ఆ పాత్రకు తగ్గ హుందాతనం, పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాల్సినప్పుడు ఆ పాత్రకు సరిపోయే లుక్, ఇప్పుడు గర్భిణీ మహిళగా కనిపించాల్సినప్పుడు అందుకు అనుగుణమైన సహజత్వం.. ఇలా ఒక్కో సినిమాకు ఒక్కో విధంగా తనను తాను మలుచుకుంటోంది. ఇదే ఆమె అంకితభావానికి నిదర్శనం.
మణిరత్నం, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్లో వస్తున్న ‘ఇంజి వెల్లం’ సాయి పల్లవికి మరో ప్రత్యేకమైన సినిమాగా నిలిచే అవకాశముంది. విజయ్ సేతుపతి, సాయి పల్లవి తొలిసారి జంటగా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ‘ఇంజి వెల్లం’ అనే తమిళ పదానికి తెలుగులో సుమారుగా ‘అల్లం నీరు’ లేదా ‘అల్లం కలిపిన పానీయం’ అనే అర్థం వస్తుంది. ఇలాంటి విభిన్నమైన టైటిల్‌తో ప్రేమకథను తెరకెక్కించడం అందరిలోనూ ఆసక్తిని రేకేత్తిస్తోంది. ఈ చిత్రాన్ని మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మిస్తోంది. 2027 జనవరి 29న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.