Mayukha Set for a Grand Overseas Release
థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. కథలో ప్రతి మలుపు ఏం జరగబోతోందనే క్యూరియాసిటీని కలిగిస్తూ, చివరి వరకు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి డిఫరెంట్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘మయూఖ’. పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అక్టోబర్ 9న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.
Mayukha Set for a Grand Overseas Release
ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్ల నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. ట్రైలర్లో కనిపించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ‘మయూఖ’పై అంచనాలను మరింత పెంచాయి. కథలోని ట్విస్టులు, టెన్షన్‌తో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయనే టాక్ వినిపిస్తోంది.
తాజాగా చిత్రబృందం ఓవర్సీస్ రిలీజ్‌కు సంబంధించిన కీలక అప్డేట్ను వెల్లడించింది. కాగ్నెయిర్ సినీ క్రియేషన్స్ ‘మయూఖ’ను ఓవర్సీస్ మార్కెట్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. దీంతో విదేశాల్లోని తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ డిఫరెంట్ థ్రిల్లర్‌ను థియేటర్లలో చూసే అవకాశం దక్కనుంది.
మరోవైపు అక్టోబర్ 9న విడుదల కావాల్సిన వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ వాయిదా పడటంతో.. ఆ తేదీన థియేటర్లలోకి వస్తున్న సినిమాలపై ప్రేక్షకుల దృష్టి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే వారితో పాటు, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఏదైనా కొత్తగా చూడాలనుకునే మూవీ లవర్స్‌కు ‘మయూఖ’ మంచి ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది.
పాయల్ చెంగప్పతో పాటు బిగ్‌బాస్ ఫేమ్ అమన్ మసూద్, దేవ్ డి, మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిశ్మ దబ్బార, జాను వర్మ, నానాజీ కర్రి, రఘు వాసిరెడ్డి, అభిలాష్ అడ్డ, వి.ఎస్. రాజు, మది నస్రీన్, బేబీ మాన్వీ, మాస్టర్ షణ్ముఖ చరణ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.
‘మయూఖ’కు బ్రహ్మనాథ్ ఎ పాటిల్ ఆర్ట్ డైరెక్టర్‌గా, ఫర్హాన్ వడక్కం సినిమాటోగ్రాఫర్‌గా, శరత్. జె ఎడిటర్‌గా పనిచేశారు. శిబి మాత్యూ అలెక్స్ సంగీతం అందించారు. డి. గిరీష్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, తేజ తోట లైన్ ప్రొడ్యూసర్‌గా, మనోజ్ పోల కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.