Nani TheParadise Movie Review Telugu
చిత్రం : ది ప్యారడైజ్
రేటింగ్ : 2 /5
నటీనటులు : నాని, మోహన్ బాబు, సోనాలీ కులకర్ణి, కయాదు లోహర్, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీరావు తదితరులు..
బ్యానర్ : SLV Cinemas
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : శ్రీకాంత్ ఓదెల
సంగీత దర్శకుడు : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రాఫర్ (డీవోపీ) : సీహెచ్ సాయి
ఎడిటర్ : నవీన్ నూలి
విడుదల తేదీ : సెప్టెంబర్ 24, 2026
Nani TheParadise Movie Review Telugu
‘దసరా’ తర్వాత మూడేళ్ల గ్యాప్‌తో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందిన చిత్రం ‘ది ప్యారడైజ్’. ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండా భారీ హైప్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ విషయానికొస్తే :
సికింద్రాబాద్‌లోని ‘ప్యారడైజ్’ ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్న సవారీ తెగకు సరైన గుర్తింపు ఉండదు. శిఖంజా మాలిక్ (మోహన్ బాబు) ఆధిపత్యంలో ఆ తెగ ప్రజలు అణచివేతకు గురవుతుంటారు. మరోవైపు తన తల్లి సమ్మక్క (సోనాలీ కులకర్ణి)తో కలిసి జడల్ (నాని) జీవితం సాగుతుంది. చిన్నతనం నుంచే శిఖంజా మాలిక్‌పై కోపంతో పెరిగిన జడల్.. కొన్ని పరిస్థితుల కారణంగా జైలుకు వెళ్తాడు. తిరిగి వచ్చిన తర్వాత అతని జీవితంలోకి సుబ్బు (కయాదు లోహర్) వస్తుంది. అదే సమయంలో తన తల్లి గురించి తాను నమ్ముతున్న విషయాల వెనుక అసలు నిజం ఏమిటో జడల్‌కు తెలుస్తుంది. సవారీ తెగకు గుర్తింపు కోసం సమ్మక్క చేస్తున్న పోరాటం, జడల్ వ్యక్తిగత కోపం, శిఖంజా మాలిక్‌తో అతని ఘర్షణ.. ఈ మూడు అంశాల చుట్టూ కథ నడుస్తుంది. చివరికి జడల్ తన ప్రజల కోసం ఏం చేశాడు? శిఖంజా మాలిక్‌తో పోరాటం ఎలా ముగిసింది? వారు కోరుతున్న గుర్తింపును ఎలా సాధించారనేది కథ.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
నాని ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్, బాడీ లాంగ్వేజ్‌తో కనిపించాడు. జడల్ పాత్ర కోసం చేసిన మేకోవర్, యాక్షన్ సన్నివేశాల్లో అతని ఎనర్జీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో నాని తన అనుభవాన్ని చూపించాడు. అయితే పాత్రకు కావాల్సిన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, కొన్ని చోట్ల ఇంపాక్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో అనిపించదు. ముఖ్యంగా కొన్ని కొన్ని డైలాగ్స్ అర్ధంకాకుండా ఉండటం మరింత మైనస్. సమ్మక్క పాత్రలో సోనాలీ కులకర్ణి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తల్లిగా, తన వర్గం కోసం పోరాడే మహిళగా ఆమె పాత్రలో ఎమోషన్ కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన సినిమాకు బలంగా నిలుస్తుంది. మోహన్ బాబు శిఖంజా మాలిక్ పాత్రలో ప్రారంభంలో బలమైన ఇంప్రెషన్ ఇస్తారు. అయితే సెకండాఫ్‌లో ఆ పాత్రకు సరైన బలం లేకపోవడంతో మొదట్లో ఏర్పడిన ఇంపాక్ట్ తగ్గిపోతుంది. కయాదు లోహర్‌ను చుక్క పాత్ర బీ గ్రేట్ ఫిల్మ్ కోసం వాడినట్టు వాడారు. అసలు ఎందుకు వీరిమధ్య లవ్ పుడుతుంతో తెలీదు. రాఘవ్ జుయల్ పాత్రను పవర్‌ఫుల్‌గా చూపించినా.. మరింత బలంగా డిజైన్ చేసి ఉంటే బాగుండనిపిస్తుంది. సంపూర్ణేష్ బాబు పాత్ర పరిమితంగానే ఉంటుంది. ఈశ్వరీరావు కీలకమైన ఎమోషనల్ సన్నివేశంలో ఆకట్టుకుంటారు. ప్రియదర్శి.. కేసీఆర్‌గా కనిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సత్యరాజ్ పాత్ర ఎందుకొస్తుందో అర్ధంకానీ పరిస్థితి.. మిగతా నటీనటులంతా తమ పరిధిమేర నటించారు.

టెక్నికల్ టీమ్ గురించి..
ఈ సినిమాకు ప్రధాన బలం అనిరుధ్ రవిచందర్ సంగీతం. ఇప్పటికే ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్న పాటలు థియేటర్లోనూ కొంత ఎనర్జీ తీసుకొస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా యాక్షన్ సన్నివేశాలకు ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే కొన్ని సందర్భాల్లో శబ్దం ఎక్కువగా అనిపిస్తుంది. డీఓపీ సీహెచ్ సాయి సినిమాకు ఒక ప్రత్యేకమైన విజువల్ టోన్ తీసుకొచ్చారు. ప్యారడైజ్ ప్రాంతం, స్లమ్ సెట్స్, యాక్షన్ బ్లాక్స్ విజువల్‌గా ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ డిజైన్ కూడా భారీ స్థాయిలో ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ మాత్రం మరింత షార్ప్‌గా ఉండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. కథనంలో ఉన్న లోపాలను ఎడిటింగ్ పూర్తిగా కవర్ చేయలేకపోయింది.
సినిమా ఎలా ఉందంటే..
‘ది ప్యారడైజ్’లో కాన్సెప్ట్ కంటే దాన్ని ప్రెజెంట్ చేసిన విధానమే ప్రధాన సమస్యగా అనిపిస్తుంది. ఒక వర్గానికి గుర్తింపు కోసం జరిగే పోరాటం, తల్లీకొడుకుల అనుబంధం, విలన్‌తో హీరో ఘర్షణ.. ఇవన్నీ కలిపి ఒక బలమైన కథను చెప్పే అవకాశం ఉంది. కానీ ఈ మూడు అంశాల మధ్య సరైన బ్యాలెన్స్ కనిపించదు. ఫస్ట్ హాఫ్‌లో కథ నెమ్మదిగా నడిచినా, నాని పాత్రను ఎలివేట్ చేసే సన్నివేశాలు, తల్లి పాత్రకు సంబంధించిన ఎమోషనల్ ట్రాక్, ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఘర్షణ సినిమా మీద ఆసక్తిని పెంచుతాయి. అయితే సెకండాఫ్‌లో అసలు సమస్య మొదలవుతుంది. కథను ముందుకు తీసుకెళ్లడానికి బదులు యాక్షన్, హింస, ఎలివేషన్స్‌పైనే ఎక్కువగా ఆధారపడటంతో నేరేషన్ పట్టుతప్పుతుంది. సన్నివేశాలన్నీ ప్రేక్షకులు ముందే ఊహించేలా ఉంటాయి. ముఖ్యంగా సినిమాలో కనిపించే హింసాత్మక సన్నివేశాలు మరీ ఎక్కువగా ఉండటంతో కొన్ని చోట్ల కథ కంటే హింసే ప్రధాన అంశంగా మారిన భావన కలుగుతుంది. అయితే తల్లీకొడుకుల ఎమోషన్ మాత్రం సినిమాకు కొంత బలం ఇస్తుంది. జడల్ పాత్ర వెనుక ఉన్న భావోద్వేగ నేపథ్యం సరిగ్గా కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం సినిమాకు మంచి హై ఇస్తుంది. సినిమా మూడు గంటలకు దగ్గరగా ఉండటం కూడా ఒక మైనస్‌గా మారింది. ఇదే కథను మరింత కుదించి, సెకండాఫ్‌ను వేగంగా నడిపి ఉంటే ప్రభావం ఇంకాస్త మెరుగ్గా ఉండేది. దురంధర్ స్టైల్లో చాప్టర్స్.. మార్కో, కిల్, చిత్రాల తరహాలో మోర్ వైలైన్స్ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది.

ప్లస్ పాయింట్స్ :
నాని మేకోవర్, పెర్ఫార్మెన్స్
సోనాలీ కులకర్ణి నటన
తల్లీకొడుకుల ఎమోషన్ (కనెక్ట్ అయితే)
ఇంటర్వెల్ బ్లాక్
మైనస్ పాయింట్స్ :
బలహీనమైన సెకండాఫ్
సాగదీసిన కథనం
ఎక్కువైన హింస
కొత్తదనం తక్కువగా అనిపించే స్క్రీన్‌ప్లే
కొన్ని పాత్రలకు సరైన ప్రాధాన్యత లేకపోవడం
ఊహించగలిగే సన్నివేశాలు
మూడు గంటలకు దగ్గరగా ఉండే రన్‌టైమ్
ఫైనల్‌గా చెప్పాలంటే..
భారీ అంచనాలతో వచ్చిన ‘ది ప్యారడైజ్’లో బలమైన కథ, పటిష్టమైన స్క్రీన్‌ప్లే విషయంలో సినిమా తడబడింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథ కంటే యాక్షన్, హింస, ఎలివేషన్స్ ఎక్కువైపోవడంతో ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే ఎమోషన్ తగ్గిపోతుంది. మంచి కాన్సెప్ట్‌ను భారీగా చూపించే ప్రయత్నం కనిపించినా, ఆ స్థాయిలో కథను నిలబెట్టడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు. నాని కష్టం కనిపిస్తుంది.. మేకింగ్ కనిపిస్తుంది.. కానీ మోర్ వైలైన్స్తో ‘ది ప్యారడైజ్’లో డబుల్ మసాలా ఉన్నా.. టేస్ట్ మాత్రం మిస్ అయ్యింది. మొత్తానికి ప్యారడైజ్ పక్కకు పోకపోవడమే బెటర్ అనిపిస్తుంది.