Veerabhadruni Rahasyam Part 2 Begins Sept 9
300 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌తో దూసుకెళ్తోన్న ‘వీరభద్రుని రహస్యం’..
సెప్టెంబర్ 9 నుంచి సీజన్ 1 పార్ట్ 2
ఇక నుంచి ప్రతి బుధవారం ఐదు ఎపిసోడ్స్..
‘మర్మదేశం’ తరహా మిస్టరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ZEE5 ఒరిజినల్ సిరీస్
ప్రముఖ ఓటీటీ వేదిక ZEE5లో స్ట్రీమింగ్ అవుతోన్న ఒరిజినల్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. డివోషనల్ మిస్టరీ అంశాలతో రూపొందిన ఈ సిరీస్ ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతూ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే సీజన్ 1 పార్ట్ 1లో భాగంగా 30 ఎపిసోడ్స్ విడుదల కాగా, ప్రతి ఎపిసోడ్‌కు మంచి స్పందన లభిస్తోంది.
ముఖ్యంగా ఈ సిరీస్ ఇప్పటివరకు 300 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌ను అధిగమించడం విశేషం. లాంగ్ ఫార్మాట్ కంటెంట్‌లో ఈ ఏడాది అత్యధికంగా వీక్షించబడిన షోలలో ఒకటిగా ‘వీరభద్రుని రహస్యం’ నిలవడం సిరీస్ విజయాన్ని తెలియజేస్తోంది.
Veerabhadruni Rahasyam Part 2 Begins Sept 9
ఇప్పుడు ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మేకర్స్ సీజన్ 1 పార్ట్ 2ను సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ 9 నుంచి సీజన్ 1 పార్ట్ 2 స్ట్రీమింగ్ కానుంది. ఇకపై ప్రేక్షకులకు మరింత ఆసక్తికరమైన అనుభూతిని అందించేలా ప్రతి బుధవారం ఐదు కొత్త ఎపిసోడ్స్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన సరికొత్త ట్రైలర్‌ను ఈ శుక్రవారం విడుదల చేయనున్నారు.
90వ దశకంలో బుల్లితెరపై సంచలనం సృష్టించిన ‘మర్మదేశం’ తరహా మిస్టరీ, ఆధ్యాత్మిక అంశాలను ఆధునిక ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా రీక్రియేట్ చేస్తూ రూపొందించిన ఈ సిరీస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సిరీస్‌పై పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
నాగబాబు మాట్లాడుతూ..“ZEE5 సమర్పణలో కల్కి రాజా నిర్మించిన ‘వీరభద్రుని రహస్యం’ అద్భుతంగా ఉంది. ప్రతి వారం కొత్త ఎపిసోడ్స్ వస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 90వ దశకంలో సంచలనం సృష్టించిన ‘మర్మదేశం’ను గుర్తు చేసేలా ఈ సిరీస్ రూపొందింది. ఇంకా చూడని వారు ఉంటే తప్పకుండా చూడండి. చాలా అద్భుతంగా ఉంది” అని అన్నారు.
నిహారిక కొణిదెల మాట్లాడుతూ..“కి మీడిగయా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కల్కి రాజా నిర్మించిన ‘వీరభద్రుని రహస్యం’ చాలా బాగుంది. ప్రేక్షకులందరూ ఈ సిరీస్‌ను చూసి ఎంజాయ్ చేయాలి” అని తెలిపారు.
‘వీరభద్రుని రహస్యం’లో రఘు కుంచె, అనూరాధ, అనీ, అభినవ్, రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. డివోషనల్ మిస్టరీ జానర్లో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌కు భీమగాని శ్రీవర్థన్ రెడ్డి దర్శకత్వం వహించారు.
ఈ సిరీస్‌లో రఘు కుంచె, అనూరాధ, అనీ, అభినవ్, రఘు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ డివోషనల్ మిస్టరీ వెబ్ సీరిస్‌కు భీమగాని శ్రీవర్థన్ రెడ్డి దర్శకత్వం వహించారు. లాంగ్ ఫార్మాట్లో ఈ ఏడాది లెక్కల్ని చూసుకుంటే మోస్ట్ వాచ్డ్ షోగా ‘వీరభద్రుని రహస్యం’ నిలిచింది.