Sangeeth Shoban Birthday Special Poster
యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్, నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని, టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీపై ఆసక్తి పెరుగుతోంది. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో యూత్ ఆడియెన్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్ ఈ సినిమాలో సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ట్రెండీ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్గా నటిస్తున్నారు.
Sangeeth Shoban Birthday Special Poster
శ్రీమతి శ్రావణి సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్, వి.జి.బి. ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై ఈ చిత్రం ప్రొడక్షన్ నెం.3గా తెరకెక్కుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నిర్మాత ధీరజ్ మొగిలినేనితో పాటు న్యూ యాస్పిరెంట్ ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మీ భూపాల్ కథ, మాటలు అందిస్తున్నారు.
హీరో సంగీత్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో సంగీత్ శోభన్ ‘మారుతి’ అనే మిడిల్ క్లాస్ యువకుడి పాత్రలో ఆకట్టుకుంటున్నారు. చేతిలో బుట్టతో ఆకుకూరలు తీసుకొస్తూ కనిపిస్తున్న ఆయన లుక్ నేచురల్‌గా, పక్కింటి అబ్బాయి తరహాలో ఉంది. సంగీత్ శోభన్‌కు చక్కగా సూటయ్యే ఈ క్యారెక్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.

ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను ఆగస్టు 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్ గ్లింప్స్‌తో సినిమా కాన్సెప్ట్, టోన్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ట్రెండీ లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యతనిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సంగీత్ శోభన్, అనస్వర రాజన్ జంటగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.