Mega158 First Half Locked Birthday Glimpse Loading
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ #Mega158 #ChiruBobby2 శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ ఇద్దరూ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
Mega158 First Half Locked Birthday Glimpse Loading
సినిమా షూటింగ్ ఇప్పటికే 40 రోజులు పూర్తి చేసుకుంది. తక్కువ సమయంలోనే కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడంతో పాటు ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ అద్భుతంగా ఉందని మేకర్స్ చెబుతున్నారు. కథలోని ఎమోషన్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ను పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా ఇటీవల చిత్రీకరించిన ఇంటర్వెల్ ఫైట్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనుందని సమాచారం. బాబీ కొల్లి మార్క్ మాస్ ఎలివేషన్స్‌తో, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్‌కు తగ్గట్టుగా ఈ యాక్షన్ బ్లాక్‌ను భారీ స్థాయిలో డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్‌కు పవర్ఫుల్ హై ఇచ్చేలా ఈ సీక్వెన్స్ ఉండనుందని టాక్.

ఇక మెగాస్టార్ అభిమానులకు మరో కిక్ ఇచ్చే అప్డేట్ రెడీ అవుతోంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘Mega158’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బర్త్‌డే స్పెషల్‌గా రాబోయే ఈ అప్డేట్పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం ఇదే వేగంతో షూటింగ్ కొనసాగిస్తూ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఎస్. సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, ఆంటోనీ ఎల్. రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అడిషనల్ స్క్రీన్‌ప్లే రైటర్స్‌గా పనిచేస్తుండగా, భాను–నందు డైలాగ్స్ రాస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి–బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.