Shravan Reddy Dual Shade in Agadha
తెలుగు తెరపై హారర్, సూపర్‌నేచురల్ కథలు కొత్తేమీ కాదు. కానీ ప్రతి హారర్ కథ ప్రేక్షకుడిని భయపెట్టాలనే ప్రయత్నం చేయదు. కొన్ని కథలు మనలో ఒక అసౌకర్యాన్ని నింపుతాయి. మనం చూసేది నిజమా? కాదా? మనకు కనిపిస్తున్న వ్యక్తి నిజంగా మనం అనుకుంటున్నట్టే ఉన్నాడా? అనే ప్రశ్నలను వెంటాడేలా చేస్తాయి. ‘అగాధ’ కూడా అలాంటి అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్న సినిమా.
Shravan Reddy Dual Shade in Agadha
కేవలం భయపెట్టే సన్నివేశాలు, జంప్ స్కేర్స్తో నడిచే రెగ్యులర్ హారర్ జానర్‌కు భిన్నంగా.. మిస్టిసిజం, సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, మిస్టరీని కలుపుకుంటూ ఒక డార్క్ అట్మాస్ఫియర్‌ను క్రియేట్ చేసే థ్రిల్లర్‌గా ‘అగాధ’ ఆసక్తిని పెంచుతోంది. కథలోని మిస్టరీ ఎంత ముఖ్యమో.. అందులోని పాత్రల మానసిక పొరలు కూడా అంతే కీలకంగా కనిపిస్తాయి. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పేరు శ్రవణ్ రెడ్డి.
ఒకే పాత్ర.. ఎన్నో కోణాలు
‘అగాధ’లో శ్రవణ్ రెడ్డి కనిపించే విధానం తొలుత చాలా సింపుల్‌గానే అనిపిస్తుంది. మన చుట్టూ కనిపించే ఒక సాధారణ వ్యక్తిలా, పెద్దగా అనుమానం రాకుండా తన పాత్రలోకి ప్రవేశిస్తాడు. కానీ కథ క్రమంగా ముందుకు సాగుతున్న కొద్దీ.. ఆ పాత్ర గురించి ప్రేక్షకుడికి ఉన్న అంచనాలు ఒక్కొక్కటిగా మారిపోతుంటాయి. పాత్రలో వచ్చే మార్పులను ఎక్కడా ఓవర్‌గా ప్రొజెక్ట్ చేయకుండా.. చాలా సహజంగా, కంట్రోల్డ్‌గా పెర్ఫార్మ్ చేయడం కనిపిస్తుంది. ఒక సీన్లో అమాయకంగా అనిపించే వ్యక్తే.. మరో సందర్భంలో అనుమానాన్ని కలిగించగలడు. ఇంకో క్షణంలో అదే వ్యక్తి గురించి పూర్తిగా భిన్నమైన అభిప్రాయం కలిగేలా చేయగలడు.
‘అగాధ’లో శ్రవణ్ పాత్రను ఒకే మాటలో నిర్వచించడం అంత సులభం కాదు. హీరోకు ఉండే పాజిటివ్ షేడ్స్, యాంటీ హీరోలో కనిపించే డార్క్నెస్.. రెండింటి మధ్య ఒక ఆసక్తికరమైన గ్రే ఏరియాలో ఈ క్యారెక్టర్ ప్రయాణిస్తుంది. ఆ గ్రే షేడ్స్‌ను శ్రవణ్ చాలా ఎఫెక్టివ్‌గా క్యారీ చేశాడు. ముఖ్యంగా.. పాత్ర ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండే సన్నివేశాల్లో కూడా అతని పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ నిశ్శబ్దంలోనే ఏదో దాగి ఉందనే ఫీలింగ్ కలిగించడం ఈ పాత్రకు ప్రత్యేకమైన టచ్‌ను తీసుకొస్తుంది. ప్రేక్షకుడు ఆ పాత్రను పూర్తిగా అర్థం చేసుకున్నానని అనుకునేలోపే మరో పొర బయటపడుతుంది. దీంతో శ్రవణ్ పాత్ర చుట్టూ ఒక నిరంతరమైన మిస్టరీ కొనసాగుతుంది.
ఒక నటుడిగా పాత్రను కేవలం సన్నివేశాల మేరకు కాకుండా.. మొత్తం కథలో దాని జర్నీని అర్థం చేసుకుని పెర్ఫార్మ్ చేసినట్టు అతని స్క్రీన్ ప్రెజెన్స్‌లో కనిపిస్తుంది. అతని బాడీ లాంగ్వేజ్, చూపులు, డైలాగ్ డెలివరీలోని కంట్రోల్.. ఇవన్నీ కలిసి పాత్రపై మరింత ఆసక్తిని పెంచుతాయి. అందుకే ‘అగాధ’లో శ్రవణ్ రెడ్డి పెర్ఫార్మెన్స్ను కేవలం హీరో లేదా యాంటీ హీరో పాత్రగా చూడటం కంటే.. కథలోని మిస్టరీని మోసుకెళ్లే కీలకమైన క్యారెక్టర్ జర్నీగా చూడటం మరింత ఆసక్తికరంగా ఉంటుంది.
సినిమా పూర్తయిన తర్వాత కథలోని కొన్ని సన్నివేశాలు మర్చిపోయినా.. శ్రవణ్ పోషించిన పాత్ర మాత్రం ప్రేక్షకుడి మైండ్‌లో కొంతకాలం ఉండిపోయేలా కనిపిస్తోంది. ‘అగాధ’లో హీరో ఎవరు? యాంటీ హీరో ఎవరు? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. కానీ శ్రవణ్ రెడ్డి మాత్రం ఈ పాత్రతో తనలోని మరో నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడనడంలో సందేహం లేదు.