Korean Kanakaraju Box Office Collections
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీకి ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ కలెక్షన్లపై స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ఈవెన్ మార్క్‌ను దాటేసి ప్రాఫిట్ జోన్లోకి ఎంట్రీ ఇచ్చింది.
Korean Kanakaraju Box Office Collections
తొలి నుంచీ సినిమాపై మేకర్స్ పెట్టుకున్న నమ్మకం ఇప్పుడు నిజమవుతోంది. పెయిడ్ ప్రీమియర్స్ నుంచే ‘కొరియన్ కనకరాజు’కు మంచి బజ్ వచ్చింది. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ సినిమాకు బలమైన ప్రమోషన్‌గా మారింది. ముఖ్యంగా సినిమాలోని కామెడీ ట్రాక్, వరుణ్ తేజ్–సత్య కాంబినేషన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
మూడు రోజుల్లో రూ.37.4 కోట్లకు పైగా గ్రాస్
‘కొరియన్ కనకరాజు’ తొలి వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.37.4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ఈవెన్ దాటినట్లు వెల్లడించారు. విడుదలైన మూడు రోజుల్లోనే రికవరీ పూర్తి చేసుకోవడం ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది. హారర్, కామెడీ అంశాలను మిక్స్ చేస్తూ మేర్లపాక గాంధీ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కథలోని హారర్ ఎలిమెంట్స్ కంటే కామెడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా వరుణ్ తేజ్, సత్య కలిసి కనిపించే సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాయి.
అమెరికాలోనూ స్ట్రాంగ్ రన్
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ ‘కొరియన్ కనకరాజు’కు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా అమెరికాలో సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌కు చేరువలో ఉన్నట్లు మేకర్స్ వెల్లడించారు. పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా రానున్న రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్లో సినిమా మరింతగా పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.
సోమవారం హాలిడే.. కలెక్షన్లకు మరింత బూస్ట్?
సోమవారం తెలంగాణలో బోనాల సందర్భంగా సెలవు ఉండటం సినిమాకు మరో అడ్వాంటేజ్‌గా మారింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన కనిపిస్తుండటంతో హాలిడే రోజున ఆక్యుపెన్సీ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీకెండ్లో వచ్చిన జోరును హాలిడే కూడా కొనసాగిస్తే సినిమా లాంగ్ రన్ మరింత బలపడే అవకాశం ఉంది.
ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజు’ బ్రేక్ఈవెన్ దాటి ప్రాఫిట్ జోన్లోకి వెళ్లడంతో ఇక ముందు సినిమా ఎంతటి లాభాలను అందుకుంటుందనేదే ఆసక్తికరంగా మారింది. పాజిటివ్ మౌత్ టాక్, కామెడీకి వస్తున్న ప్రశంసలు, వరుణ్ తేజ్–సత్య కాంబినేషన్‌కు వచ్చిన క్రేజ్‌ను చూస్తుంటే ఈ హారర్ కామెడీకి రానున్న రోజుల్లోనూ మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘కొరియన్ కనకరాజు’.. వరుణ్ తేజ్‌కు మరో మంచి కమర్షియల్ విజయాన్ని అందించే దిశగా దూసుకెళ్తోంది.