Nayanthara & Kavin ‘Hi’ Set for August 28 Release
లేడీ సూపర్ స్టార్ నయనతార, యువ నటుడు కవిన్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘హాయ్’ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఆగస్టు 28న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను ప్రకటించడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
Nayanthara & Kavin ‘Hi’ Set for August 28 Release
తమిళ సినీ గేయ రచయిత విష్ణు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై నయనతార, విఘ్నేష్ శివన్, ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. వినోద్ సి.జే., కె.ఎస్. మయిల్ వాగనన్ సహ నిర్మాతలుగా, వి.కె. కుబీంద్రన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో నయనతార, కవిన్‌తో పాటు కె. భాగ్యరాజ్, ప్రభు, రాధికా శరత్‌కుమార్, వీటీవీ గణేష్, సత్యన్, ఆదిత్య కథిర్, ఖురైషి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజేష్ శుక్లా సినిమాటోగ్రఫీ అందించగా, జెన్ మార్టిన్ సంగీతం సమకూర్చారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా, ఎస్. కన్నన్ ప్రొడక్షన్ డిజైన్ చేశారు.
ఇప్పటికే విడుదలైన తొలి పాటకు డిజిటల్ వేదికల్లో మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తాజా పోస్టర్ కూడా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటంతో విడుదలపై మంచి బజ్ ఏర్పడింది.
దర్శకుడు విష్ణు మాట్లాడుతూ.. “‘హాయ్’ టైటిల్‌కు తగ్గట్టుగానే ఇది ఒక సింపుల్, హార్ట్‌వార్మింగ్, ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చెన్నై, కోయంబత్తూరు, పొల్లాచ్చి నేపథ్యాల్లో సాగే ఈ కథలో బంధాలు, భావోద్వేగాలు, హాస్యం సమపాళ్లలో ఉంటాయి. ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’, ‘సంతోష్ సుబ్రమణ్యం’, ‘యారాడి నీ మోహిని’ తరహాలో కుటుంబం మొత్తం కలిసి థియేటర్లో చూసి ఆస్వాదించే సినిమా ఇది’’ అని తెలిపారు.
‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ వంటి విజయవంతమైన చిత్రాలకు గేయ రచయితగా పనిచేసిన విష్ణు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం కావడం, నయనతార-కవిన్ తొలి ఆన్‌స్క్రీన్ జోడీ కావడం, పూర్తి స్థాయి ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కడం వల్ల ‘హాయ్’పై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.