Yash Toxic Movie New Release date Locked
రాకింగ్ స్టార్ యష్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ (Toxic: A Fairy Tale for Grown-Ups) సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రానికి కొత్త రిలీజ్ డేట్‌ను మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు కొత్త పోస్టర్‌తో ప్రకటించింది. ‘నీ తండ్రిని గౌరవించు’ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Yash Toxic Movie New Release date Locked
‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యష్ నటిస్తున్న తొలి చిత్రం కావడంతో ‘టాక్సిక్’పై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే షూటింగ్ ఆలస్యం, స్క్రిప్ట్‌లో మార్పులు, నిర్మాణ పనుల కారణంగా సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. ముందుగా మార్చిలో రిలీజ్ అనుకున్నారు.. కానీ ఆ టైమ్‌లో యుద్ధాల కారణంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. జూన్‌లో రిలీజ్ అన్నారు.. అయితే మరింత బెటర్ అవుట్‌పుట్ కోసం మరోసారి వాయిదా అన్నారు. దీంతో మొదట కనిపించిన హైప్ క్రమంగా తగ్గిపోయిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో కూడా సినిమా గురించి చర్చలు తగ్గిన నేపథ్యంలో అభిమానులు రిలీజ్‌పై సందిగ్ధంలో ఉన్నారు.
ఇలాంటి సమయంలో చిత్రబృందం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడం వారికి పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది. రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో ఇకపై ప్రమోషన్లను వేగవంతం చేసి సినిమాపై మళ్లీ భారీ బజ్ క్రియేట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. యష్ అభిమానులు కూడా ఈ ప్రకటనతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. యష్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. యాక్షన్, ఎమోషన్, గ్యాంగ్‌స్టర్ డ్రామా లాంటి అన్ని ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Yash Toxic Movie New Release date Locked
‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘టాక్సిక్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే వరుస వాయిదాల కారణంగా తగ్గిన బజ్‌ను తిరిగి తీసుకురావాలంటే ట్రైలర్, టీజర్, ప్రమోషనల్ కంటెంట్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇప్పుడు రిలీజ్ డేట్ ఖరారవడంతో ఆ దిశగా చిత్రబృందం దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ‘టాక్సిక్’ యష్‌కు మరో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందా? లేదా అనేది చూడాలి. అభిమానులు మాత్రం ఈసారి ఇంకెలాంటి వాయిదాలు లేకుండా సినిమా థియేటర్లలోకి రావాలని ఆశిస్తున్నారు.