మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. చిరంజీవి నటిస్తున్న 158వ సినిమా కావడంతో #మెగా158తోపాటు ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరు, బాబీ కలయికలో రాబోతున్న చిత్రం కావడంతో #చిరుబాబీ2 వర్కింగ్ టైటిల్స్‌తో రూపొందిస్తున్నారు. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా తమిళనాడులోని పొల్లాచ్చిలో నిర్వహించిన కీలక షూటింగ్ షెడ్యూల్‌ను చిత్రబృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవి, ఇతర ప్రధాన తారాగణంపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ షెడ్యూల్లో చిరంజీవి, అనస్వర రాజన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో చిరంజీవి కుమార్తెగా అనస్వర కనిపించనుంది. ఇక
తదుపరి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. దశాబ్దాలుగా తన ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి, ఈ చిత్రంలో తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్ మరియు ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఆ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా సాధించారు.
ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను విజయ్ కార్తిక్ కన్నన్ నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను అవినాష్ కొల్లా చేపట్టగా, ఎడిటింగ్ బాధ్యతలను ఆంటోనీ ఎల్. రూబెన్ నిర్వహిస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అదనపు స్క్రీన్‌ప్లే రచయితలుగా పనిచేస్తున్నారు. భాను–నందు సంభాషణలను అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలు భాషల్లో విజయవంతమైన చిత్రాలను అందించిన కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఇది తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఈ చిత్రంలోని హీరోయిన్‌తోపాటు ఇతర ప్రధాన తారాగణానికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు.