Slum Dog Teaser Launch Event
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, వెర్సటైల్ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’. ఈ మూవీ
టీజర్‌ను సోమవారం విడుదల చేశారు.
“ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి… అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతాను” అనే పవర్ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్ ప్రేక్షకులను వెంటనే కథలోకి తీసుకెళ్తుంది. యాక్షన్, ఎమోషన్, మిస్టరీ అంశాల మేళవింపుతో రూపొందిన విజువల్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. విజయ్ సేతుపతి ఇందులో కళ్లు లేని వాడి బిచ్చగాడి పాత్రలో కనిపిస్తుండగా, ఆ పాత్ర వెనుక దాగి ఉన్న రహస్యం కథలో కీలకాంశంగా కనిపిస్తోంది. ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ ఇంటెన్సిటీ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంయుక్త హీరోయిన్గా నటిస్తుండగా, టబు పోలీస్ పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకున్నారు. దునియా విజయ్ పవర్ఫుల్ విలన్‌గా కనిపించగా, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమాటోగ్రాఫర్ సామ్ కె. నాయుడు అందించిన రా అండ్ గ్రిటీ విజువల్స్, హర్షవర్ధన్ రామేశ్వర్ కంపోజ్ చేసిన ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంతోష్ నూజిళ్ల ఎడిటింగ్ టీజర్‌ను మరింత ఎంగేజింగ్‌గా మలిచాయి.
Slum Dog Teaser Launch Event
ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ‘పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో నటించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆయన కథ చెప్పే విధానం, ప్రతి సన్నివేశంపై ఉండే క్లారిటీ అసాధారణం. ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్ ఉన్నాయి. ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది. ‘స్లమ్ డాగ్’ పూరి జగన్నాథ్ గారి కెరీర్లో బెస్ట్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలుస్తుందని నమ్ముతున్నాను” అన్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘విజయ్ సేతుపతి లాంటి నటుడు దొరకడం దర్శకుడికి వరం. ఈ సినిమాలో ప్రేక్షకులు ఆయనను పూర్తిగా కొత్త కోణంలో చూస్తారు. ఇది నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో రూపొందిన కథ. సాధారణంగా మనం పట్టించుకోని బిచ్చగాళ్ల జీవితాల్లో దాగి ఉన్న భావోద్వేగాలను ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. యాక్షన్ మాత్రమే కాదు, హృదయాన్ని తాకే ఎమోషన్స్ కూడా ఇందులో ఉంటాయి. ముఖ్యంగా జెన్-జీ యూత్ తమ కుటుంబాలతో కలిసి చూసేలా ఈ సినిమాను రూపొందించాం’ అని అన్నారు. నిర్మాత ఛార్మీ కౌర్ మాట్లాడుతూ ‘ఇది మా తొలి స్ట్రెయిట్ తమిళ చిత్రం. రియల్ ఎమోషన్స్, ఒరిజినల్ స్టోరీటెల్లింగ్, పవర్ఫుల్ యాక్షన్ ఈ సినిమాకు ప్రధాన బలాలు. పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబినేషన్ ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది’ అని తెలిపారు. హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ ‘పూరి జగన్నాథ్ గారితో పనిచేయాలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది. ఇందులో నేను పోషించిన పాత్రలో ఎన్నో భావోద్వేగాలు, వేరియేషన్స్ ఉన్నాయి. విజయ్ సేతుపతి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప అనుభవం’ అని చెప్పారు. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి ఆరు విభిన్నమైన పాటలు స్వరపరిచాం. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కథకు మరో స్థాయి తీసుకెళ్తుంది’ అని అన్నారు.
పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జేబీ నారాయణరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ పాన్ ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది. టీజర్‌కు లభిస్తున్న స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.