peddi first review peddi story
‘పెద్ది’ ఫస్ట్ రివ్యూ.. ‘పెద్ది’ కథ ఇదేనా
రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పెద్ది’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య రూపొందిన ఈ చిత్రం జూన్ 4న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతోంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. జూన్ 3 నుంచే వరల్డ్‌వైడ్ ప్రీమియర్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నటీనటులు, టీమ్‌లోని సభ్యులంతా ఒక్కొక్కరు సినిమా గురించి చెప్పిన విశేషాల ఆధారంగా ఈ మూవీ స్టోరీ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.
peddi first review peddi story
‘పెద్ది’ కథే ఇదేనంటూ..
1970- 1980 బ్యాక్‌డ్రాప్‌లో విజయనగరం నేపథ్యంగా ఈ కథ సాగుతుంది. విజయనగరం జిల్లాలోని ఒక చిన్న గిరిజన గ్రామం. దేశం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్నా, ఆ గ్రామం మాత్రం మ్యాప్‌లో కూడా కనిపించని స్థితిలో ఉంటుంది. ఆ గ్రామానికి ప్రపంచంతో అనుసంధానం కావాలంటే ఒక రైల్వే స్టేషన్ తప్పనిసరి. ఈ కల కోసం జీవితాంతం పోరాడుతుంటాడు గ్రామ పెద్ద అప్పలసూరి (జగపతిబాబు). అప్పలసూరి కుమారుడు పెద్ది (రామ్ చరణ్) మాత్రం తండ్రిలా ఉద్యమాల కంటే ఆటలపైనే ఆసక్తి చూపుతాడు. బెల్లం ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తూనే క్రికెట్లో తనదైన టాలెంట్‌తో రాణిస్తుంటాడు. కానీ వారి గ్రామానికి గుర్తింపు లేకపోవడంతో అతని టాలెంట్ కూడా గ్రామ సరిహద్దులు దాటదు. ఒక రోజు గ్రామ ప్రజల హక్కుల కోసం పోరాడుతూ అప్పలసూరి ప్రాణాలు కోల్పోతాడు. తండ్రి మరణం పెద్ది జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. గ్రామానికి పేరు తీసుకురావాలన్న తండ్రి కలను తన భుజాలపై వేసుకుంటాడు. అదే సమయంలో సమీప రైల్వే స్టేషన్ మాస్టర్ (బోమన్ ఇరానీ) పెద్దికి ఒక ఆలోచన చెబుతాడు.
ఒక మనిషి సాధించిన విజయం, ఒక గ్రామానికి చిరునామా కావచ్చు.. అనే మాట తనలో ఆలోచన రేపుతుంది. దేశం మొత్తానికి తన గ్రామం గురించి తెలియాలంటే జాతీయ స్థాయిలో విజయం సాధించాలని నిర్ణయించుకుంటాడు. మొదట తనకు ఇష్టమైన క్రికెట్లో ప్రయత్నిస్తాడు. కానీ ఆ కాలంలో అవకాశాల కొరత, గ్రామీణ నేపథ్యం కారణంగా ముందుకు వెళ్లలేడు. అప్పుడు తండ్రి స్నేహితుడు, మాజీ జాతీయ రెజ్లర్ గౌర్నానాయుడు (శివ రాజ్‌కుమార్) అతనిలోని పట్టుదలను గుర్తించి రెజ్లింగ్‌లో శిక్షణ ఇస్తాడు. పెద్ది కఠోర సాధనతో జాతీయ స్థాయికి చేరుకుని దేశం తరఫున పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంటాడు. అయితే సెమీ ఫైనల్‌కు చేరుకున్న సమయంలో ప్రత్యర్థుల కుట్ర వల్ల తీవ్ర గాయం అవుతుంది. అతని రెజ్లింగ్ కెరీర్ ఒక్కసారిగా ముగిసిపోతుంది. జీవిత లక్ష్యం చేతిలోంచి జారిపోవడంతో పెద్ది తీవ్ర నిరాశలోకి వెళ్తాడు. ఆ సమయంలో బోమన్ ఇరానీ చెప్పిన మరో మాట అతనికి గుర్తుకొస్తుంది. ఆ స్ఫూర్తితో పెద్ది తన శారీరక సామర్థ్యానికి సరిపోయే అథ్లెటిక్స్ వైపు అడుగులు వేస్తాడు. గాయం, అవమానం, నిరాశ అన్నింటినీ అధిగమించి రన్నింగ్‌లో కొత్త ప్రయాణం మొదలుపెడతాడు. దేశవ్యాప్తంగా జరిగే పోటీల్లో విజేతగా నిలుస్తూ చివరకు అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటుతాడు. పెద్ది సాధించిన విజయం దేశమంతా వార్తగా మారుతుంది. అతని గ్రామం పేరు ప్రతి పత్రికలో, ప్రతి రేడియోలో వినిపిస్తుంది. ప్రభుత్వం కూడా గ్రామ ప్రాధాన్యతను గుర్తించి అక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలుపుతుంది. చివరగా ప్రారంభమైన రైల్వే స్టేషన్‌పై పెద్ద అక్షరాలతో గ్రామం పేరు కనిపిస్తుంటే, పెద్ది తండ్రి కల నెరవేరుతుంది. ఒక వ్యక్తి విజయం, ఒక గ్రామానికి గుర్తింపుగా మారుతుంది.
peddi first review peddi story
ఈ కథను దర్శకుడు బుచ్చిబాబు చాలా బాగా హ్యాండిల్ చేశాడని తెలుస్తోంది. ఈ చిత్రంపై టీమ్‌లోని ప్రతి ఒక్కరూ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ కథలో అందరిలోనూ స్ఫూర్తి నింపుతుందని రామ్ చరణ్ మొదటి నుంచీ చెబుతున్నారు. ఆయన ట్రైలర్లో చెప్పిన డైలాగు “మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నాను.. కానీ నేను పోరాడాను..సారూ..’ అని చరణ్ చెప్పిన డైలాగ్ సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. అలాగే ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అర్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి, రైరై రారా పాటలు మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి.