Two films from Nallamala director Ravi Charan
‘నల్లమల’ దర్శకుడు రవిచరణ్ నుంచి రెండు విభిన్న చిత్రాలు..
ఆగస్టులో ‘నవాబ్’, జూన్‌లో ‘జెన్ జి గర్ల్స్’ షూటింగ్ ప్రారంభం
కొత్త ఆలోచనలతో, సహజత్వానికి దగ్గరగా ఉండే కథనాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న దర్శకుడు రవిచరణ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రెండు విభిన్నమైన చిత్రాలతో రానున్నారు. తన తొలి చిత్రం ‘నల్లమల’ ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్న రవిచరణ్, ఇప్పుడు ‘నవాబ్’, ‘జెన్ జి గర్ల్స్’ చిత్రాలను రూపొందిస్తున్నారు. ‘నవాబ్’ సినిమా సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టులో ‘నవాబ్’ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు, నేటి యువత ఆలోచనలు, జీవనశైలి, సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులను ప్రతిబింబించే కథతో ‘జెన్ జి గర్ల్స్’ చిత్రం రూపొందనుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం జూన్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది. యూత్‌కు కనెక్ట్ అయ్యేలా నేటి సమాజంలో ప్రతిరోజూ కనిపించే వ్యక్తుల జీవితాల ఆధారంగా ఈ కథను రూపొందిస్తున్నారు.
ఒకవైపు సామాజిక సందేశాన్ని అందించే ‘నవాబ్’, మరోవైపు మోడర్న్ లైఫ్ చూపించే ‘జెన్ జి గర్ల్స్’ చిత్రాలతో దర్శకుడు రవిచరణ్ మరోసారి తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. విభిన్న కథలు, సహజమైన కథనం, బలమైన పాత్రలతో రూపొందుతున్న ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Two films from Nallamala director Ravi Charan
ఇక క్రియేటివిటీకి అధిక ప్రాధాన్యత ఇచ్చే రవిచరణ్, ఆయన ఎంచుకునే ప్రతి కథలో వాస్తవికతకు పెద్దపీట వేయడంతో పాటు, కథా నేపథ్యానికి తగ్గ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటారు. ముఖ్యంగా ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉండేలా కథను ముందుకు నడిపిస్తారు. అలాగే ఈ రెండు చిత్రాలు ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది.