టాలీవుడ్లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచే జంటల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీ ఒకటి. సినిమాల్లోనూ, బయట జీవితంలోనూ ఒకరికొకరు సపోర్ట్‌గా నిలుస్తూ… “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అనిపించేలా ఈ ఇద్దరూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఒక వైపు తమ తమ సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్న ఈ జంట సోషల్ మీడియాలో కూడా తరచూ ట్రెండ్ అవుతూనే ఉంది. ఎక్కడికైనా వెకేషన్‌కు వెళ్లినా, ఈవెంట్స్‌లో కనిపించినా… వీరి కెమిస్ట్రీ మాత్రం ఫ్యాన్స్‌కు స్పెషల్ ఫీల్ ఇస్తోంది. ఇద్దరూ కలిసి నటించిన గీత గోవిందం, డియర్ క్రామేడ్ సినిమాల్లో వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. అదే బాండింగ్ ఆఫ్ స్క్రీన్‌లో కూడా కనిపించడం వల్ల వీరి మధ్య రిలేషన్‌పై ఎప్పుడూ చర్చలు సాగుతూనే ఉంటాయి. అయితే ఈ ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాలపై ఎక్కువగా మాట్లాడకపోయినా… ఒకరి గురించి ఒకరు చెప్పే మాటలు, చిన్న చిన్న జెస్టర్స్ మాత్రం వారి దగ్గరితనాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అందుకే ఫ్యాన్స్ మాత్రం ఈ జంటను రియల్ లైఫ్‌లో కూడా ఒకటిగా చూడాలని కోరుకుంటున్నారు. మొత్తానికి సినిమాలు ఒక వైపు, లైఫ్ మరోవైపు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, స్టైల్, సక్సెస్, హ్యాపినెస్ అన్నీ కలిపిన పర్ఫెక్ట్ కాంబినేషన్‌గా ఈ జంట టాలీవుడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 1854-1878 మధ్య కాలంలో, బ్రిటిష్ వారి అకృత్యాలు మరియు కరువు నేపథ్యంలో, ఒక వీరయోధుడి పోరాటాన్ని చూపే ఈ సినిమా 2026 సెప్టెంబర్ 11న విడుదల కానుంది.





