షాకింగ్ : ‘బరి’ సెట్‌లో వరుణ్ తేజ్‌కు గాయం.. మోకాలికి ఆపరేషన్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడ్డారు. ఆయన హీరోగా నటిస్తున్న ‘బరి’ షూటింగ్‌లో అనుకోని ప్రమాదం జరిగింది. వాలీబాల్ సీక్వెన్స్‌ల కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వరుణ్‌కు తీవ్రమైన మోకాలి (క్నీ) ఫ్రాక్చర్ అయింది. తక్షణమే అపోలో హాస్పిటల్‌లో వైద్య సహాయం అందించబడగా, వైద్యుల పర్యవేక్షణలో వరుణ్ తేజ్‌కు సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయ్యిందని కుటుంబ సభ్యులు, సినీ వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ల సూచన మేరకు కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉండటంతో “బరి” సినిమా షూటింగ్‌కు తాత్కాలిక విరామం ఇవ్వబడింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే వరుణ్ తేజ్ మళ్లీ కోలుకుని షూటింగ్‌లో పాల్గొంటారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, వరుణ్ తేజ్ సోదరి నిహారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… ‘‘మా సోదరుడు వరుణ్ తేజ్ ‘బరి’ సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించబడింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయి ఆరోగ్యంతో తిరిగి కోలుకుని, మళ్లీ సాధారణ జీవితానికి రావాలని మేము ఆశిస్తున్నాం. ఈ సమయంలో ఆయనకు అందించిన ప్రేమ, శ్రద్ధ, మద్దతుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని నిహారిక కొణిదెల పోస్ట్ చేశారు. యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా, పవన్ కళ్యాణ్ అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే స్పోర్ట్స్‌ డ్రామా ఇది. వాలీబాల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. అనుదీప్ దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా, వరుణ్ గాయం కారణంగా షూటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని