Venkatesh Adarsha Kutumbam Release Delay
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం – AK47’పై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రకటించిన అక్టోబర్ 2 విడుదల తేదీ నుంచి సినిమాను అక్టోబర్ 9కి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే.. ఈ వారం రోజుల మార్పు వెనుక అసలు కారణం ఏంటన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
Venkatesh Adarsha Kutumbam Release Delay
మేకర్స్ మాత్రం ప్రేక్షకులకు మరింత మెరుగైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే రిలీజ్‌ను వారం రోజులు వాయిదా వేసినట్లు చెబుతున్నారు. కానీ.. సినిమా విడుదలకు మరికొద్ది రోజులే ఉన్న సమయంలో తేదీ మారడం సహజంగానే పలు అనుమానాలకు తావిస్తోంది.
ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. వెంకటేష్‌ను మధ్యతరగతి కుటుంబ పెద్దగా చూపిస్తూ.. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్‌ను టీజర్లో చూపించారు. దీంతో అక్టోబర్ 2న సినిమా కోసం ప్రేక్షకులు సిద్ధమవుతున్న సమయంలో రిలీజ్ డేట్ మారడం చర్చనీయాంశంగా మారింది.
సినిమా కంటెంట్‌కు సంబంధించిన పనులు ఇంకా పూర్తికాకపోవడమా? పోస్ట్ ప్రొడక్షన్లో ఊహించని ఆలస్యమా? లేక రిలీజ్ డేట్ చుట్టూ ఉన్న ఇతర సినిమాల లెక్కలు మారాయా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే వీటిలో ఏ కారణం నిజమన్నది మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు.. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు సరైన రిలీజ్ విండో కోసం చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే చర్చ కూడా జరుగుతోంది. కేవలం వారం రోజుల గ్యాప్ కావడంతో.. ఇది పెద్ద సమస్యగా కాకుండా ప్లానింగ్‌లో భాగంగానే చూడాలన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో ‘ఆదర్శ కుటుంబం – AK47’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా.. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల సక్సెస్‌లో రైటర్‌గా త్రివిక్రమ్‌కు ఎంతో పేరొచ్చింది. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి.