Varun Tej Korean Kanakaraju Gets Release Date
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు మేర్లపాక గాంధీ రూపొందిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ హారర్, కామెడీ, కొరియన్ కల్చర్, గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌ల కలయికతో రూపొందుతున్న డిఫరెంట్ ఎంటర్టైనర్. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Varun Tej Korean Kanakaraju Gets Release Date
ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచగా, ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో చార్ట్‌బస్టర్‌గా నిలిచి సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో వేగంగా సాగుతున్నాయి.
రిలీజ్ డేట్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఒక చేతిలో రక్తం మరకలతో ఉన్న కత్తి, మరో చేతిలో గ్రెనేడ్ పట్టుకుని కుర్చీలో ధీమాగా కూర్చున్న వరుణ్ తేజ్ లుక్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. చుట్టూ భయంకరమైన కొరియన్ గ్యాంగ్స్టర్లు ఉన్నా ఏమాత్రం భయపడని అతని బాడీ లాంగ్వేజ్, నియాన్ లైట్స్‌తో నిండిన గ్యాంగ్‌స్టర్ సెటప్ పోస్టర్‌ను మరింత స్టైలిష్‌గా మార్చాయి. ఈ ఒక్క పోస్టర్‌తోనే సినిమాలో యాక్షన్, హారర్, కామెడీ కలిసిన ఓ సరికొత్త అనుభూతి ఉండబోతోందనే సంకేతాలు ఇచ్చింది చిత్రబృందం.
ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. సంగీత సంచలనం ఎస్. థమన్ బాణీలు సమకూరుస్తుండగా, మనోజ్ రెడ్డి కటసాని సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
విభిన్నమైన కథ, వినోదభరితమైన ట్రీట్మెంట్, వరుణ్ తేజ్ కొత్త అవతార్‌తో ‘కొరియన్ కనకరాజు’ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే ట్రైలర్, మ్యూజిక్, ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.