Tiger Is Back: Jailer 2 Trailer Out
సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్ వచ్చేసింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ వాటిని మరింత పెంచేలా ఉంది. ముఖ్యంగా ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మరోసారి తనదైన స్టైల్, స్వాగ్, మాస్ ఎలివేషన్స్‌తో అదరగొట్టారు.
Tiger Is Back: Jailer 2 Trailer Out
‘జైలర్’లో విలన్ వర్మను అంతం చేసిన తర్వాత ముత్తువేల్ పాండియన్ జీవితంలోకి మరోసారి ప్రమాదం వస్తుంది. అయితే ఈసారి తన అసలు గుర్తింపును దాచుకుని సాధారణ వ్యక్తిలా జీవిస్తున్నట్లు ట్రైలర్లో చూపించారు. జైలర్ కోసం శత్రువులు వేట మొదలుపెట్టగా.. అతడు తనను వెతుక్కుంటూ వచ్చిన వారిని ఎలా ఎదుర్కొన్నాడు? అసలు ముత్తువేల్ పాండియన్ గతం ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్‌ను కట్ చేశారు.
ఒకవైపు యాక్షన్.. మరోవైపు నెల్సన్ మార్క్ క్విర్కీ కామెడీ.. వీటికి రజనీకాంత్ మాస్ యాటిట్యూడ్ జత కావడంతో ట్రైలర్ ఫుల్ మీల్స్ ఎంటర్టైనర్లా కనిపిస్తోంది. రజనీకాంత్ స్టైల్‌గా నడిచే సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగ్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులకు కావాల్సినంత మాస్ ట్రీట్ ఇస్తున్నాయి.
ఇక విలన్స్ విషయంలోనూ ‘జైలర్ 2’ రేంజ్ పెరిగినట్లు కనిపిస్తోంది. ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజారమూడు, మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. వీరితో ముత్తువేల్ పాండియన్ చేసే పోరాటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.
అంతేకాదు.. ‘జైలర్’లో మెప్పించిన రమ్యకృష్ణ, మిర్నా, యోగిబాబు కూడా సీక్వెల్లో కొనసాగుతున్నారు. మొదటి పార్ట్‌లో స్పెషల్ అప్పీయరెన్స్లతో థియేటర్లలో సందడి చేసిన మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ కూడా మరోసారి కనిపించడంతో ‘జైలర్ 2’పై మరింత క్రేజ్ పెరిగింది.
అనిరుధ్ రవిచందర్ సంగీతం ట్రైలర్‌కు మరింత ఎనర్జీని అందించగా.. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ భారీ యాక్షన్ సన్నివేశాలను గ్రాండ్‌గా చూపిస్తోంది. ఆర్. నిర్మల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
‘జైలర్’తో బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌గా నిలిచిన రజనీకాంత్–నెల్సన్ మరోసారి కలిసి వస్తుండటంతో ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఫస్ట్ పార్ట్‌లోని మాస్, కామెడీ, యాక్షన్‌కు మరింత పెద్ద స్కేల్‌ను జోడించినట్లు స్పష్టమవుతోంది.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తోంది. అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘జైలర్ 2’.. ముత్తువేల్ పాండియన్ మ్యాజిక్‌ను మరోసారి థియేటర్లలో రిపీట్ చేస్తుందేమో చూడాలి.