నిఖిల్ ‘స్వయంభు’ నుంచి ‘రారా ధీవరా’

నిఖిల్ హీరోగా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిఖిల్‌ను ఓ యోధుడిలా చూపిస్తూ ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. శనివారం నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో సినిమాలోని మొదటిపాటకు ముహూర్తం పెట్టారు. ‘రారా ధీవరా’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సాంగ్ కోసం రవి బస్రూర్ పవర్‌‌ప్యాక్డ్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశారని మేకర్స్ తెలియజేశారు. ఈ అనౌన్స్‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌లో నిఖిల్ కొత్త అవతార్‌‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నారు. ఈ వారియర్‌‌ క్యారెక్టర్‌‌ కోసం అతను ఫిజికల్‌ మేకోవర్‌‌తో పాటు ఇంటెన్స్‌ ట్రైనింగ్ తీసుకున్నారు. నిఖిల్‌ సరసన సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కేకే సెంథిల్ కుమార్‌‌ డీవోపీగా వర్క్ చేస్తుండగా ‘కేజీఎఫ్’ ఫేం రవి బస్రూర్ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. విజయ్ కామిశెట్టి ఈ చిత్రానికి అద్భుతమైన డైలాగ్స్‌ను అందిస్తున్నారు. నిఖిల్ హీరోగా నటిస్తున్న 20వ సినిమా ఇది. తన కెరీర్‌‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రేక్షకులను ఆకట్టుకునే విజువల్ ఎఫెక్ట్స్‌తో రాబోతున్న ఈ సినిమా విజయంపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని చిత్రబృందం తెలియజేసింది.

 

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని