ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం : శర్వానంద్

‘బైకర్’ తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుందని చెప్పామని, ఆ మాట నిలబెట్టుకున్నామని అన్నాడు చార్మింగ్ స్టార్ శర్వానంద్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ UV క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటో క్రాస్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రిమియర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రేక్షకులు, విమర్శకులు నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తో బంపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ ని నిర్వహించారు. థాంక్యూ మీట్‌లో హీరో శర్వా మాట్లాడుతూ ‘‘నేను మంచి ఫ్యామిలీ సినిమాలు చేస్తాననే నమ్మకాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కోల్పోలేదు. మొదటి నుంచే బైకర్ తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుందని చెబుతున్నాను. ఆ మాట తప్పలేదు. అలాంటి మంచి ఫ్యామిలీ సినిమాను తీశాం. సినిమా అద్భుతంగా మౌత్ టాక్‌తో వెళ్తోంది. దానికి కారణం ఫ్యామిలీ ఆడియన్స్, యూత్. అభిలాష్ మంచి ఫాదర్ అండ్ సన్ స్టోరీ చెప్పాడు. ఇది చాలా ఎమోషనల్ మూవీ. నిజ జీవితంలో తండ్రి, కొడుకులు అలానే ఉంటారు. రాజశేఖర్ గారు మాకు ఎప్పుడూ హీరోనే. ఆయన ఈ సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. రేసింగ్ సీన్స్ ఇంత అద్భుతంగా వచ్చాయంటే, అది మొత్తం టీమ్ ఎఫర్ట్. టెక్నికల్‌గా సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉందని ప్రశంసలు రావడానికి మా టీమ్ వర్క్ కారణం. ఇది నా బెస్ట్. ఇంత అద్భుతమైన సినిమాను అందించిన యువీ క్రియేషన్స్‌కు ధన్యవాదాలు. మేము చేసిన నాలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్లే. నా వెనుక దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను. ఈ ఏడాది నాకు రెండు హిట్లు ఇచ్చాడు. ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని చెప్పాడు. డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి, నా క్యారెక్టర్‌కు మంచి పేరు రావడానికి కారణం అభిలాష్ రెడ్డి గారు. అలాగే శర్వా గారు, మాళవిక ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు’ అని చెప్పారు. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ ‘ ప్రీమియర్స్ నుంచే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాను అభినందించారు. చూసిన వాళ్లందరూ కూడా ఇంత అద్భుతంగా ఎలా తీశారని అడుగుతున్నారు. టెక్నికల్‌గా సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో రేసింగ్‌తో పాటు ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవుతున్నారు. ఫాదర్ అండ్ సన్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్స్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. మొదటి రోజు నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు. చిన్న చిన్న పిల్లలు కూడా సినిమాను చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇది చాలా లాంగ్ రన్ ఉండే సినిమా. ఈ సమ్మర్ అంతా బైకర్ దే’ అని అన్నాడు. హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ ‘ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేం. అదే పాయింట్‌తో ఈ సినిమాను మీ ముందుకు తీసుకొచ్చాం. ఎమోషన్‌కు ఆడియన్స్ చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు. సినిమాను చూసి మరో పదిమందికి చెప్పండి. అందరికీ థాంక్యూ సో మచ్’ అని చెప్పింది. ఈ ఈవెంట్ లో మూవీ టీం పాల్గొన్నారు.

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని