మూడేళ్ల క్రితం శ్రీవిష్ణుకు జంటగా ‘అల్లూరి’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన కయాదు లోహర్ గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. రీసెంట్గా ‘డ్రాగన్’లో నటించి కోలీవుడ్‌లోనూ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బీజియెస్ట్ హీరోయిన్గా దూసుకెళ్తోంది. శనివారం కయాదు లోహర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులో ఒకటైన ‘ది ప్యారడైజ్’ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌తోపాటు, తన క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ కయాదుకు బర్త్‌డే విషెస్ తెలియజేసింది చిత్రబృందం. ‘వెండితెరపై వెలగని తార’ మా సుబ్బలక్ష్మిని చూడంటి అంటూ రిలీజ్ చేసిన తన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. సైకిల్‌పై కనిపిస్తూ వింటేజ్ లుక్‌లో తన గెటప్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే జడల్ పాత్రలో నాని కనిపించబోతున్నట్టు రిలీజ్ చేసిన ఆయన పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. శింకజ మాలిక్ పాత్రలో మోహన్ బాబు విలన్ రోల్లో కనిపించనున్నారు. రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చితత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 21న ఎనిమిది భాషల్లో పాన్-వరల్డ్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలై ‘ఆయా షేర్ ’ సాంగ్‌తోపాటు ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.





