Suriya’s ‘Scene’ Title Glimpse:
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ఆవేశం’ వంటి డిఫరెంట్ యాక్షన్ కామెడీతో తనదైన ముద్ర వేసుకున్న మలయాళ దర్శకుడు జితు మాధవన్‌తో కలిసి సూర్య తన 47వ చిత్రాన్ని చేస్తున్నారు. ఇప్పటికే తమిళంలో టైటిల్ అనౌన్స్ చేసి ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు పెంచగా.. తాజాగా తెలుగులోనూ ‘సీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
‘ఆవేశం’ ఫేమ్ జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్లో సూర్యకు జోడీగా నజ్రియా నజీమ్ నటిస్తున్నారు. ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జఘరం స్టూడియోస్, 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య సంయుక్తంగా నిర్మిస్తుండగా.. జయశ్రీ దామోదరన్ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
Suriya’s ‘Scene’ Title Glimpse:
‘సీన్’ టైటిల్ గ్లింప్స్‌ను చూస్తే.. దర్శకుడు జితు మాధవన్ మరోసారి తనదైన ఎక్స్సెంట్రిక్ టేకింగ్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్ ప్రారంభంలోనే సూర్యను ఓ విచిత్రమైన పోలీస్ ఆఫీసర్‌గా పరిచయం చేస్తూ క్యారెక్టర్‌కు సంబంధించిన ఆసక్తిని పెంచారు. ఓ క్రైమ్ సీన్ దగ్గరకు సూర్య ఎంట్రీ ఇవ్వడం, అతని ప్రవర్తనను డిఫరెంట్‌గా చూపించడం గ్లింప్స్‌కు ఫన్ టచ్ తీసుకొచ్చాయి. అదే సమయంలో ఈ క్యారెక్టర్‌లోని మరో కోణాన్ని ‘సైకో’ అంటూ పరిచయం చేయడం క్యూరియాసిటీని పెంచింది.
అయితే గ్లింప్స్‌లో అసలు హైలైట్ మాత్రం సూర్య ఇంట్రడక్షన్. DSP ప్రేమ్‌రాజ్ పాత్రలో సూర్య పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఓ కానిస్టేబుల్ భుజంపై చేయి వేసుకుని చాలా కూల్‌గా నడుచుకుంటూ వచ్చే సూర్య.. ఎంత కష్టమైన క్రిమినల్ అయినా తన ప్రత్యేకమైన సామర్థ్యంతో ట్రాక్ చేసి పట్టుకోగలననే కాన్ఫిడెన్స్‌ను తన డైలాగ్ ద్వారా చూపించారు. అతని నడక, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో కనిపించిన స్వాగ్.. గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా సూర్య ఇచ్చే వార్నింగ్‌తో క్యారెక్టర్‌లోని యాటిట్యూడ్ స్పష్టంగా కనిపించింది.
హీరో క్యారెక్టర్లను కాస్త ఎక్స్సెంట్రిక్గా, అదే సమయంలో ఎంటర్టైనింగ్గా డిజైన్ చేయడంలో జితు మాధవన్ తన మార్క్ చూపించినట్లు గ్లింప్స్ చూస్తే అనిపిస్తోంది. సూర్య లాంటి స్టార్ హీరోను డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ప్రజెంట్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. సినిమాటోగ్రాఫర్ వినీత్ అగస్టిన్ అందించిన స్టైలిష్ విజువల్స్, సుశిన్ శ్యామ్ అందించిన ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు మరింత ఎనర్జీని తీసుకొచ్చాయి. అజ్మల్ సాబు ఎడిటింగ్, అశ్విని కాలే ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
టైటిల్ గ్లింప్స్‌తో ‘సీన్’పై ఆసక్తిని పెంచిన మేకర్స్.. సినిమాను దీపావళి సందర్భంగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సూర్య యాటిట్యూడ్, జితు మాధవన్ మ్యాడ్నెస్, సుశిన్ శ్యామ్ బీజీఎం కలిసిన ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో మంచి హైప్‌ను క్రియేట్ చేస్తోంది.