ట్రైలర్ రిలీజ్ చేసిన చరణ్ బావకు థ్యాంక్స్

లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సతీ లీలావతి’. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహించారు. మే 8న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. శనివారం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసి సినిమా విజయం సాధించాలని కోరుతూ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ .. ‘ఈ సినిమా కోసం మేం పెట్టిన శ్రమ, మా ప్రేమ, మా కష్టం అంతా తెరపై ఆడియెన్స్ చూస్తారు. సత్య గారు, ఉదయ్ గారు మంచి కథను నా వద్దకు తీసుకు వచ్చారు. ‘సతీ లీలావతి’ అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రం కోసం నాగ మోహన్ గారు చాలా కష్టపడ్డారు. నేను చిత్రీకరణ సమయంలో ప్రెగ్నెంట్ అని తెలిశాక టీం మొత్తం సపోర్ట్ చేసింది. దేవ్ గారు సొంతంగా డబ్బింగ్ చెప్పారు. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మా బావ గారు రామ్ చరణ్‌కి థాంక్స్. ఆయన రిలీజ్ చేయడం వల్ల మా ట్రైలర్‌కి, మా సినిమాకు రీచ్ పెరిగింది. మా ట్రైలర్‌ని అందరూ చూసి సపోర్ట్ చేయండి. మే 8న మా సినిమాని చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
దేవ్ మోహన్ మాట్లాడుతూ .. ‘సమంత గారితో చేసిన ‘శాకుంతలం’ తర్వాత మళ్లీ తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరితో పాటే నేను కూడా ట్రైలర్ చూశాను. నాకు ట్రైలర్ చాలా నచ్చింది. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. ఈ మూవీ, ఇందులో నేను పోషించిన పాత్ర చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. లావణ్య గారితో నటించడం ఆనందంగా ఉంది. అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
తాతినేని సత్య మాట్లాడుతూ .. ‘మా ‘సతీ లీలావతి’ ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. ఈ చిత్రీకరణ సమయంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. రైటింగ్‌లో సపోర్ట్ చేసిన ఉదయ్ గారికి, నా డైరెక్షన్ టీంలోని వేణు గారు, రమేష్ గారు, శ్రీకాంత్ గారు, సాయి గారికి థాంక్స్. మే 8న మా చిత్రం రాబోతోంది. ఇది చాలా మంచి సినిమా. అందరూ థియేటర్‌కు వచ్చిన ఈ సినిమాని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నాగ మోహన్ మాట్లాడుతూ .. ‘‘సతీ లీలావతి’ చిత్రం మే 8న రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. లావణ్య మేడంకి, దేవ్ సర్‌కి థాంక్స్. వారిద్దరూ ఇచ్చిన సపోర్ట్‌తోనే సినిమాను ఇక్కడి వరకు తీసుకు రాగలిగాం. మా ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. మా సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
జీవన్ బొటిమల మాట్లాడుతూ .. ‘లావణ్య త్రిపాఠి గారితో పని చేయడం వల్ల నాకు వెంటనే ‘విశ్వంభర’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు వచ్చాయి. ఆమె నాకు లక్కీ హ్యాండ్‌గా మారారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
బినేంద్ర మీనన్ మాట్లాడుతూ .. ‘సత్య గారితో నాకు ఇది రెండో చిత్రం. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఎంతో సరదాగా సినిమాని షూట్ చేశాం. డిఫరెంట్ లొకేషన్‌లో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశాం. మే 8న మా సినిమా రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
అభినయ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘సతీ లీలావతి’ చిత్రంలో నేను ఒక పాటను రాశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మే 8న ఈ మూవీ రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
తాగుబోతు రమేష్ మాట్లాడుతూ .. ‘‘భీమిలి కబడ్డీ జట్టు’ నుంచి సత్య గారు నాకు అవకాశం ఇస్తూనే వచ్చారు. లావణ్య గారు ప్రెగ్నెన్సీ టైంలోనూ షూటింగ్ చేశారు. అది చాలా గొప్ప విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. మే 8న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
సప్తగిరి మాట్లాడుతూ .. ‘‘సతీ లీలావతి’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. అందరం కలిసి ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. నాటి ‘సతీ లీలావతి’ అందరికీ ఇష్టం. ఇప్పుడు మేం తీసిన ఈ ‘సతీ లీలావతి’ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. మౌత్ టాక్‌తోనే ప్రస్తుతం థియేటర్లకు జనాలు వస్తున్నారు. మే 8న మా దర్శకుడు సత్య మీద నమ్మకంతో రండి. అందరూ ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.
రైటర్ ఉదయ్ మాట్లాడుతూ .. ‘‘సతీ లీలావతి’ రాసినప్పుడు ఎంత ఫన్ అనిపించిందో.. టీజర్, ట్రైలర్ చూస్తే అంత కంటే ఎక్కువగా ఎంటర్టైన్ ఫీల్ అయ్యాను. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

 

Related Posts

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

నటుడిగా కెరీర్ ప్రారంభించి, అగ్ర నిర్మాతగా ఎదిగి టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న బండ్ల గణేష్ ఇంట్లో ఆదివారం ఆనందం వెల్లివిరిసింది. ఆయన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఘనంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడగా, సినీ రాజకీయ ప్రముఖుల రాకతో కార్యక్రమం మరింత…

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

గోపీచంద్ హీరోగా తన 34వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రంతో ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

  • By Nani
  • May 3, 2026
  • 4 views
బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

  • By Nani
  • May 3, 2026
  • 9 views
ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

  • By Nani
  • May 3, 2026
  • 10 views
‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

  • By Nani
  • May 3, 2026
  • 21 views
రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

  • By Nani
  • May 2, 2026
  • 6 views
టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్

  • By Nani
  • May 2, 2026
  • 7 views
ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్